Ads
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగరీత్యా ఎంతో బిజీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే జంక్ ఫుడ్ కి అలవాటు పడి అధిక బరువు పెరిగి, కొవ్వు పెంచుకొని గుండె జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టే ఈ చిన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..! గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. సోడియం తక్కువ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఎలా నిరోధించబడతాయి అనేదానిపై ఇంకా పరిశోధన కొనసాగుతోంది.
Video Advertisement
ది లాన్సెట్ లో ప్రచురించబడిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తీసుకుంటే గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తుల జీవితతాలు మెరుగుపడుతున్నాయని తెలియజేశారు. ఎనిమిది వందల మంది పై చేసినటువంటి అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులను రెండు విభాగాలుగా చేశారు. ఈ వ్యక్తులందరికీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇందులో ఒక విభాగానికి తక్కువ సోడియం ఉన్న ఆహారం ఇచ్చారు. అక్కడ వాళ్లు ఒక రోజులో 150mg కన్నా తక్కువ సోడియం ఆహారం తీసుకుంటారు. ఈ క్రమంలో ఇంకో సమూహంలోని వ్యక్తులకు వారి ప్రాంతం ప్రకారం సోడియం మొత్తం ఇవ్వబడింది.
ఈ యొక్క రెండు బృందాలను దాదాపు 12 నెలల పాటు పర్యవేక్షించారు. తక్కువ సోడియం తీసుకున్నవారిని ఆసుపత్రిలో చేరడం తగ్గించలేదు కానీ వారి జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగు పడ్డాయని అన్నారు. వీరు తక్కువ సోడియం తీసుకోవడం వల్ల ఆస్పత్రికి ఎక్కువ పోయే అవకాశం తగ్గిందని చెప్పారు. ఎక్కువ సోడియం ఇచ్చిన వారిలో ఆస్పత్రికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు
గుండె వైఫల్యానికి ప్రధాన కారణాలు : శరీరానికి కావాల్సిన రక్తాన్ని ప్రభావవంతంగా పంపు చేస్తేనే గుండె ఆరోగ్యంగా ఉందని అర్థం. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు ఆక్సిజన్ అందుతాయి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏర్పడితే గుండె వైఫల్యం ఏర్పడుతుంది.అలసటగా ఉండటం,చాలా వేగవంతమైన హృదయ స్పందన. అధిక ద్రవం కారణంగా వాపు,శ్వాస ఆడకపోవడం, నిరంతరమైన దగ్గు
ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
End of Article