Ads
ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. దీనికోసం భారత్ లో క్రికెట్ అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ సందడి మాములుగా లేదు. అయితే..ఈ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో స్టేడియంలో చుట్టూ ఉండేవాళ్ళల్లో కొంతమంది అనూహ్యంగా ఫేమస్ అయిపోతూ ఉంటారు.
Video Advertisement
ఇటీవలే ఓ యువ జంట మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ముద్దు పెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఓ బ్యూటీ కూడా కెమెరా కంటికి చిక్కి యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
CSK ఫ్యాన్ గర్ల్ గా ఫేమస్ అయిన ఆ అమ్మాయి పేరు దేవిక నాయర్. తాజాగా.. మరో మిస్టరీ గర్ల్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇప్పటి వరకు గ్రౌండ్ లో ఆడే ఆటగాళ్లకు మాత్రమే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆటని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఊహించని విధంగా ఫేమస్ అయిపోతున్నారు. గతంలో 2019 లో RCB మ్యాచ్ సందర్భంగా దీపికా ఘోష్ అనే అమ్మాయి కూడా ఇలానే వైరల్ అయ్యి.. ఆ తరువాత బాగా ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఈ ఐపీఎల్ లో ఇటీవల దేవికా నాయర్ అనే అమ్మాయి బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా మరో బ్యూటీ కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. మంగళవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓ మిస్టరీ గర్ల్ అందరి మనసులు దోచుకుంది.ఆమె ఎవరో కాదు.. దేవ్ మనుష్ అనే సీరియల్ లో నటించిన అమ్మాయి. ఈ సీరియల్ లో డాక్టర్ డింపుల్ నుంచి ఏసీపీ దివ్య వరకు అందరి పాత్రలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సీరియల్ లో ఏసిపి దివ్యగా నటించిన ఆమె పేరు నేహాఖాన్ . ఆమె ఐపీఎల్ లో కనిపించి సందడి చేసిన మిస్టరీ గర్ల్. మ్యాచ్ చూడడానికి వచ్చిన నేహాఖాన్ బాగానే ఎంజాయ్ చేసింది. అయితే.. ఆమె ఏ జట్టుని సపోర్ట్ చేస్తుంది అన్న విషయం మాత్రం తెలియలేదు.
End of Article