Ads
మనం మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే నిజానికి చాలా మంది పూజలు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ముఖ్యంగా పూజ సమయం విషయంలో చాలా మంది తప్పులు చేయడం జరుగుతుంది. ఏ సమయంలో పూజ చేస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం.
Video Advertisement
ఎవరి వీలుని బట్టి వాళ్ళు నచ్చిన సమయంలో పూజ చేయకూడదు. అయితే దైవానుగ్రహం పొందాలంటే ఏ సమయంలో పూజ చేయాలి అనేది తప్పక తెలుసుకోండి.
మరి పండితులు ఏ సమయంలో పూజ చేస్తే మంచిది అని అంటున్నారో ఇప్పుడు చూద్దాం. సమయపాలన పూజ విషయంలో చాలా ముఖ్యం. ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా సమయపాలన పాటించి పూజలు చేస్తూ ఉంటారు. అదే విధంగా మనం కూడా సమయపాలన ప్రకారం ఆచరించాలి. ఏ సమయంలో పూజ చేయాలి అనేది తప్పకుండా తెలుసుకుని దానికి తగ్గట్టుగా అనుసరించాలి.
ఇంట్లో పూజ కాస్త అటూ ఇటూ అయితే పరవాలేదు. కానీ మిట్టమధ్యాహ్నం వేళలో పూజ చేయడం మంచిది కాదు. ప్రతి వారం లేదా ప్రతి రోజూ చేసుకునే పూజా అయితే ఉదయం 10 గంటల లోపు పూర్తి చేస్తే మంచిది. ఒకవేళ 11 గంటల వరకు అయినా పర్వాలేదు. కానీ మళ్లీ మధ్యాహ్నం పూట పూజ చేయొద్దు.
ఇలా చేయడం నిజంగా మంచిది కాదు. రాత్రి పూజలు చేయడం కేవలం దుష్టశక్తుల్ని ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేరు అని పండితులు చెబుతున్నారు. అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయి. ఉదయం ఎనిమిది దాటకుండా పూజ అయ్యి పోతే మరీ మంచిది. దైవ అనుగ్రహం పొందాలంటే తప్పకుండా వీటిని పాటించండి. దీనితో మీకు అంతా శుభమే కలుగుతుంది.
End of Article