అక్కడ శివుడిని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా..? ఈ శివాలయం ఎక్కడ ఉందంటే..?

అక్కడ శివుడిని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా..? ఈ శివాలయం ఎక్కడ ఉందంటే..?

by Mohana Priya

Ads

భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్ లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తులే.

Video Advertisement

అయితే.. ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

irland sivalay 1

యూరప్ లోని ఐర్లాండ్ లో ఈ శివాలయం ఉంది. అయితే.. ఈ శివాలయం ఇక్కడకు ఎప్పుడు.. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ లింగోద్భవం ఇప్పటికీ అంతు తెలియని మిస్టరీ గానే మిగిలిపోయింది. ఓ కొండ పై ఈ శివలింగం ఉంది. చుట్టూ ఇటుకలు గుండ్రని ఆకారం లో పేర్చబడి ఉన్నాయి. లియా ఫాయిల్ గా పిలవబడే ఈ రష్యా రాయిని అక్కడి వారు పరమ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతి పురాతన లింగం గా వెలుగొందుతున్న ఈ విగ్రహాన్ని క్రైస్తవులు పునరుత్పత్తి కి చిహ్నం గా భావిస్తూ కొలుస్తున్నారు.

irland sivalay 3

ఈ లింగం గురించి ” మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” అనే గ్రంధం లో కూడా చెప్పబడి ఉంది. అక్కడి చారిత్రాత్మక కధనం ప్రకారం.. క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య కాలం లో త్వాతా డి డానన్ అను వ్యక్తి తీసుకొచ్చాడని ప్రతీతి. త్వాతా డి డానన్ అనే వ్యక్తిని డాను అనే దేవత యొక్క కొడుకు గా అక్కడివారు చెప్పుకుంటారు. ఈ దేవత గురించిన ప్రస్తావన మన గ్రంధాలలో కూడా ఉంటుంది.

కశ్యప ముని, అతని భార్య దక్ష లకు జన్మించిన కూతురే డాను అని చెప్తుంటారు. డాను అంటే జలానికి అధిపతి అని అర్ధమట. అలా.. లియో ఫాయిల్స్ లోని శివలింగానికి , భారతీయ వేద సంస్కృతి లో వర్ణించబడ్డ శివుడికి సంబంధం ఉన్నదని అక్కడి కధనం. వారి భాషలో లియా ఫెల్ అంటే అదృష్ట శిలా అని అర్ధమట. ఈ రాయిని నాశనం చేయాలనీ ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎవరితరం కాలేదట. 2012 జూన్ లోను, 2014 లోను కూడా ఈ లింగం పై దాడి జరిగిందట. ఈ లింగాన్ని కాపాడాలంటూ అక్కడివారు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


End of Article

You may also like