Ads
డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ లెవెల్స్ ని ఎలా మెయింటెన్ చేసుకోవాలో తెలియక చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు మన ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..? మనం ముందుగా కొత్తిమీర, నిమ్మకాయలను తీసుకోవాలి. కొత్తిమీరలో మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అంతే కాకుండా కొత్తిమీర రక్తాన్ని సరఫరా
Video Advertisement
చేయడంతో పాటుగా శక్తిని కూడా ఇస్తుంది. అంతేకాకుండా మన శరీరంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా తోడ్పడుతుంది. అదేవిధంగా నిమ్మకాయ మన శరీరంలో ఉన్న షుగర్ ని ఒకే లెవెల్లో ఉంచడానికి, జీర్ణ సంబంధ సమస్యలను మెరుగుపరచడానికి, మెటబాలిజంను బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయ, కొత్తిమీర ను ఉపయోగించి మంచి డిటాక్స్ వాటర్ ని తయారు చేసుకోవాలి. ఇది ఎలా అంటే.. ఒక
గ్లాసులో నీళ్ళు తీసుకొని దానిలో కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. అదే నీళ్లలో నిమ్మకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ రెండింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ గ్లాస్ మీద మూత పెట్టుకోని రాత్రి మొత్తం అలాగే ఉంచుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే నిమ్మకాయ ముక్కలను,కొత్తిమీర ను నీళ్ల లో నుంచి తీసి పక్కన
పెట్టేసి ఆ నీళ్లను పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, అలాగే షుగర్ లెవెల్స్ ని క్రమబద్దీకరించడం లో, ఎనర్జీ పెరగడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి ఈ నీళ్లు చాలా ఉపయోగపడతాయి.
End of Article