Ads
భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అన్ని మతాలను తన ఒడిలో దాచుకున్న దేశం భారత్.. అందుకే ఇక్కడ హిందూ ముస్లిం భాయ్ భాయ్, అనే సామెత కూడా వచ్చింది. అయితే ఒక్కో మతానికి ఒక్కొక్క సాంప్రదాయం, సంస్కృతి ఉంటుంది. అయితే మనం ముస్లింల సాంప్రదాయం, విలువ ఏంటో తెలుసుకుందాం..!!
Video Advertisement
మనం ముస్లింల దర్గాలు కానీ, మసీదు కానీ, వారి ఇల్లు కానీ చూస్తే 786 అనే నెంబర్ నెలవంక స్టార్ బొమ్మతో కనిపించడం మనం చూసే ఉంటాం. అయితే ఈ నెంబరు చాలా మంది ముస్లింలు వారి వాహనాల మీద లేదా ఫోన్ నెంబర్లలో ఈ నెంబర్ వచ్చేలా చూసుకుంటారు.
మరి ఈ నెంబర్ కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు. దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం.. 5వ శతాబ్దంలో పుట్టినటువంటి అరబిక్ భాషలో ఇరవై ఎనిమిది అక్షరాలు ఉంటాయి. అబ్జర్వ్ న్యూమరస్ ప్రకారం అరబిక్ భాషలో ఇరవై ఎనిమిది అక్షరాలకు ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం జరిగింది.
ఈ నెంబర్లలో 782ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ లో బిస్మిల్లా హి రహమాన్, హీ రహీం ఈ పదం అర్థం ఏమిటంటే సహనశీలి త్యాగమూర్తి అల్లా అని ఈ చిత్రంలో చూపించినట్టు బిస్మిల్లా హి రహమాన్, హి రహీం అనే పవిత్ర వాక్యం రాయడానికి ఉపయోగించి అక్షరాల న్యూమరిక్ నెంబర్లను కలిపితే 786 అని వస్తుంది.
బిస్మిల్లా, హి రహమాన్, హి రహీమ్ అని పలుకుతూ ఏ కార్యాన్ని మొదలుపెట్టిన మంచి జరుగుతుందని ఆ వాక్యానికి సింబాలిక్ గా 786 అని రాస్తూ ఉంటారు.
End of Article