Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.
Video Advertisement
ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.
సమయం గురించి కూడా చాణక్యనీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పింది. జీవితంలో సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే లక్ష్యాలను చేరుకోవడానికి సులభంగా ఉంటుంది. సమయాన్ని వృధా చేస్తే ఎప్పటికీ లక్ష్యాల్ని చేరుకోలేరు. అలానే ఆచార్య చాణక్య కొన్ని విషయాలలో దాగి ఉన్న విజయ రహస్యాన్ని చెప్పారు. మరి వాటి కోసం ఇప్పుడే చూద్దాం.
#1. త్వరగా నిద్ర లేవడం మంచిది:
ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే ఎంతో మంచిది. దీనివల్ల మన పనులు త్వరగా పూర్తి చేసుకోవడానికి అవుతుంది. అలానే బద్ధకం కూడా ఉండదు.
#2. పౌష్టికాహారం తీసుకోవడం:
పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోజంతా మనకి శక్తి ఉంటుంది. అలానే వ్యాధులతో పోరాడగలము.
#3. మధురంగా మాట్లాడటం:
చక్కగా మాట్లాడటం చాలా అవసరం. మధురంగా మాట్లాడటం ద్వారా మనిషి ఎంత పెద్ద పనైనా సరే ఈజీగా చేసుకోగలరు.
#4. వినయంగా ప్రవర్తించడం:
వినయం మంచి గుణం. వినయం ఉన్న చోట గౌరవం లభిస్తుంది.
#5. క్రమశిక్షణ అవసరం:
ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉంటే మనిషి విజయం సాధిస్తాడు. ఎంతటి కష్టమైన లక్ష్యాన్ని అయినా సరే క్రమశిక్షణ ఉంటే చేరుకోవడానికి అవుతుంది.
End of Article