ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?

ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?

by Megha Varna

Ads

డ్రై ఫ్రూట్స్ లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోమని చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని నీళ్లలో నానబెట్టుకుని తింటారు. ఆరోగ్య నిపుణులు డ్రై ఫ్రూట్స్ ని నీళ్ళల్లో నానబెట్టి తీసుకుంటే త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తాయి అని అంటున్నారు.

Video Advertisement

డ్రై ఫ్రూట్స్ నీళ్లలో నానబెట్టి తీసుకోవడం వల్ల వాటి యొక్క ప్రయోజనాలు మరింత ఎక్కువ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

కానీ చాలా మందికి దీని వెనుక ఉన్న కారణం తెలియదు. మామూలుగా అలవాటైపోయి వాటిని నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. అయితే మరి ఏ డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టి తీసుకుంటే ఎలాంటి లాభం పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష ని కూడా రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది. దీనిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తియ్యగా ఉండే ఎండు ద్రాక్ష ని ఎవరైనా తినడానికి ఇష్ట పడతారు. నీళ్లలో నానబెట్టి దీనిని తీసుకోవడం వల్ల దీని వల్ల కలిగే లాభాలు డబల్ అవుతాయి. అలానే ఎండు ద్రాక్ష నీటిని రోజూ తాగితే చర్మం మెరుస్తుంది.

#2. బాదం పప్పు:

పచ్చి బాదం తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇది జీర్ణం అవ్వడం కొంచెం కష్టం అందుకని నానబెట్టుకుని తీసుకుంటే మంచిది. అప్పుడు త్వరగా జీర్ణమవుతుంది. అలానే చక్కటి పోషక విలువలు మనకు అందుతాయి.

#3. జీడిపప్పు:

ఆరోగ్యానికి జీడిపప్పు కూడా మేలు చేస్తుంది. జీడిపప్పును కూడా నానబెట్టుకుని తీసుకోవచ్చు లేదంటే పచ్చిదైనా తీసుకోచ్చు. ఎలా తీసుకున్నా పోషకాలు అందుతాయి. కానీ నానబెట్టిన జీడిపప్పు లో రుచి ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా తినడమే బెస్ట్.


End of Article

You may also like