Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు.
Video Advertisement
ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి.
ఆచార్య చాణక్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. ఆచార్య చాణక్య చాణక్య నీటి ద్వారా భార్య గురించి కూడా ముఖ్యమైన విషయాలను చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏ సందర్భాల్లో భార్య యొక్క లక్షణాలు బయట పడతాయి అనేది చూద్దాం.
చాణక్య నీతి ప్రకారం భార్య తన భర్తకు మంచి సలహాదారు. కనుక తప్పనిసరిగా భర్త భార్య సలహాలను తీసుకోవాలి. అలానే మంచి సలహాలను భార్య ఇవ్వాలి. అప్పుడు నిజంగా భర్త విజయాన్ని సాధించడానికి అవుతుంది. అలానే చాణక్య డబ్బు విలువ తెలుసుకునే భార్య ధనాన్ని పొదుపు చేస్తుందని చెప్పారు.
అదే విధంగా ఏదైనా కష్టం లో భర్త ఉంటే భార్య సహాయం చేస్తుందని అలా సహాయం చేసే భార్య ఉంటే భర్త కష్ట కాలం నుంచి బయటపడవచ్చని చాణక్య చెప్పారు. అయితే జీవితంలో ప్రతిసారీ ఆనందం మాత్రమే ఉండదు. ఒకసారి కష్టం ఉంటే మరో సారి సుఖం ఉంటుంది. రెండు కలిపితేనే జీవితం. ఒకవేళ కనుక భర్త కి ఏదైనా కష్ట కాలం వచ్చిందంటే అది భార్యకు పరీక్షా కాలం. భర్త కి కష్టం వచ్చినప్పుడే భార్య లోని లక్షణాలు బయటపడతాయి. అలానే భార్య మాత్రమే కాదు స్నేహితుడు, సేవకుల నిజమైన లక్షణాలు కష్టకాలంలోనే బయటపడతాయి.
End of Article