ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ తింటున్నారా..? మంచిదేనా..?

ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ తింటున్నారా..? మంచిదేనా..?

by Megha Varna

Ads

మనకు తెలియకుండానే మనం ఎన్నో మంచి కాంబినేషన్స్ ను తింటూ ఉంటాము. ఇడ్లీ సాంబార్ ను చట్నీ తో తీసుకుంటాము. ఆకలి సరిగా లేకపోయినా ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ లో అన్ని పోషకాలు ను మనం పొందవచ్చు.

Video Advertisement

ఒకవేళ సాంబార్ తో ఇడ్లీ తినకపోతే ప్రోటీన్ అందకపోవడం వల్ల తొందరగా ఆకలేస్తుంది. మరి ఎలాంటి కాంబినేషన్స్ ను తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనేది చూద్దాం.

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది అని అదే పనిగా ఆకుకూరలు కూడా తినకూడదు. దానితో పాటుగా విటమిన్ సి ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐరన్ ఫెర్రస్ స్టేట్ లోకి మారుతుంది. దాంతో మీ శరీరానికి ఐరన్ ఎంతో సులువుగా అందుతుంది.

ఇలా రెండు ఆహార పదార్థాల్ని కలుపుకొని తీసుకోవడం వల్ల పోషకాలు శరీరానికి ఎంతో తేలికగా అందుతాయి. కాకపోతే కొన్ని రకాల ఆహార పదార్ధాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఆల్కహాల్ మరియు ఇతర ఆహార పదార్థాలు:

ఎప్పుడైనా ఆల్కహాల్ తో పాటుగా ఎలాంటి ఆహార పదార్థాలనైనా తీసుకుంటే మీ శరీరంలోకి పోషకాలు సరిగ్గా అందవు. ఆల్కహాల్ పోషకాలు అందకుండా చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ బీ, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటివి అసలు అందవు.

క్యాల్షియం మరియు ఐరన్:

ఎప్పుడైనా క్యాల్షియం మరియు ఐరన్ కలిసి ఉండే పదార్థాలను కలిపి తీసుకుంటే పోషక విలువలు శరీరంలోకి సరిగ్గా అందవు. అంతేకాకుండా క్యాల్షియం తో పాటు ఐరన్ ని తీసుకున్నప్పుడు ఐరన్ 50 నుండి 60 శాతం తక్కువగా అందుతుంది. అందుకే అందరూ పాలు, చేపలు కలిపి తినకూడదని అంటూ ఉంటారు.

పాలు మరియు మిలన్స్:

పాలు మరియు మిలెన్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిలన్స్ త్వరగా అరుగుతాయి. కానీ పాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకు ఈ కాంబినేషన్ ను కూడా తీసుకోకపోవడమే మేలు.


End of Article

You may also like