ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువ అవుతున్నాయా..? అయితే ఆడపిల్లేనా..?

ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువ అవుతున్నాయా..? అయితే ఆడపిల్లేనా..?

by Megha Varna

Ads

గర్భిణీలకు చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. తొమ్మిది నెలల్లో కూడా ఎన్నో మార్పులు వాళ్ళలో వస్తూ ఉంటాయి. పైగా పెద్ద వాళ్లు పాత కాలం విషయాలన్నిటినీ కూడా గర్భిణీల తో చెబుతూ ఉంటారు. అయితే అటువంటి విషయాలన్నీ నమ్మొచ్చా..? నమ్మకూడదా..? అవి నిజామా కాదా అనేది తప్పని సరిగా తెలుసుకోవాలి.

Video Advertisement

కొన్ని అపోహలు, అనుమానాలు గర్భధారణ సమయం లో ఉంటాయి. అయితే ఏది నిజం..?, ఏది నిజం కాదు అన్నది తప్పక తెలుసుకోవాలి. అయితే మరి ఎక్కువగా వినపడే అపోహల గురించి ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ వాంతులు అయితే ఆడపిల్ల పుడుతుందా..?

చాలా మంది పెద్దవాళ్ళు దీనిని చెప్తూ ఉంటారు. కొంత మంది బిడ్డ పుట్టే వరకు కూడా వాంతుల తో బాధ పడుతూ ఉంటారు. దీన్ని హైపరెమిసిస్‌ గ్రావిడరమ్‌ అని అంటారు అయితే దీని వల్ల ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్లవాడు పుడతాడా అనేది చెప్పలేము. ఆడపిల్ల పుట్టే వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుంది అనేది నిజం కాదు.

ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకోవాలా..?

చాలా మంది తల్లి కి, బిడ్డ కి కావాల్సినంత ఆహారం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అది కూడా నిజం కాదు. సెకండ్ ట్రైమిస్టర్ లో 340 క్యాలరీలు, థర్డ్ ట్రైమిస్టర్లో 450 కేలరీలు తీసుకోవాలి. అంతే కానీ ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకోవాలని ఏమీ లేదు.

కుంకుమ పువ్వు తీసుకుంటే ఎర్రటి పిల్లలు పుడతారా..?

కుంకుమ పువ్వు ని పాలలో కలుపుకుని తాగితే పిల్లలు తెల్లగా పుడతారు అని అంటూ ఉంటారు. అయితే బిడ్డ రంగు అనేది జన్యుపరంగా వస్తుంది అంతే కానీ తీసుకునే ఆహార పదార్థాల వల్ల రంగు ఉండదు. కాబట్టి ఇది కూడా అవాస్తవమే.

 


End of Article

You may also like