Ads
హిందువులు అందరూ నమ్మేది సనాతన ధర్మాన్ని. అయితే దానిలో ఉండేటు వంటి కర్మ సిద్ధాంతం ఎన్నో పాఠాలను నేర్పుతుంది.
Video Advertisement
పుట్టుక, చావు మరియు జీవితం మనిషి కర్మ ప్రకారమే జరుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివ పురాణంలో మనిషి చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు కనబడతాయి అని చెప్పడం జరిగింది, అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
#1. శరీరం రంగు తెలుపు లేక నీలం రంగు లోకి మారితే కనుక ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోవచ్చు.
ఎప్పుడైనా మనిషి నీడ తన వెంటే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీడ విడిచి వెళ్ళిపోతుందో అప్పుడు మరణానికి కొంత సమయమే ఉంది అని అర్థం.
#2. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఇలాంటి కాంతులను చూడడానికి ఇబ్బంది పడిన లేక అవి ఎరుపు రంగులోనే కనిపిస్తే వారు ఆరు నెలలు మాత్రమే జీవించుతారు.
#3. ఎప్పుడైనా నూనె, నెయ్యి మరియు అద్దం లో మన ప్రతిబింబాన్ని చూడగలం. అయితే ఎప్పుడైతే ప్రతిబింబాన్ని చూడలేమో అప్పుడు ఆరు నెలల్లో మరణిస్తారు అని సంకేతం.
#4. ఏ వస్తువు చూసినా నలుపు రంగులో కనిపించడం లేక రంగులను గుర్తించడానికి ఎంతో ఇబ్బంది పడితే వారి మరణం దగ్గర లో ఉంది అని సూచిస్తుంది.
#5. నీలం రంగులో ఉండేటువంటి ఈగలు హఠాత్తుగా వచ్చి ఒక వ్యక్తి దగ్గరే చుట్టుముడితే కచ్చితంగా వారి మరణం చేరువలో ఉంది అని చెబుతుంది.
#6. కఫ, పిత్త, వాత దోషాలను త్రిదోషాలు అని అంటారు. ఈ మూడు దోషాలు ఒకసారి కలిగితే వారి మరణం తొందర లోనే ఉంది అని చెప్పవచ్చు.
#7. అర్ధరాత్రి సమయంలో కుక్కలు అరిస్తే లేక తీతువు పిట్ట ఇంటి పై నుంచి వెళ్లిన ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి చావు సమీపంలో ఉండనే ఉన్నట్టే.
End of Article