Ads
ఎప్పుడైనా మనం మ్యాట్రిమోనీ సైట్ల లో చూస్తే డాక్టర్ల కి డాక్టర్లు కావాలని రాస్తూ ఉంటారు. అలానే డాక్టర్ల పెళ్లి టాపిక్ వస్తే డాక్టర్లు డాక్టర్ వృత్తి లో ఉన్న వాళ్లనే చేసుకుంటాము అని చెప్తూ ఉంటారు. పైగా కొందరు అయితే డాక్టర్లు దొరికే దాకా పెళ్లి చేసుకోరు.
Video Advertisement
వయస్సు ఎక్కువై పోతున్న సరే సింగిల్స్ గానే వుంది పోతారు. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు డాక్టర్లు డాక్టర్లునే వివాహం చేసుకుంటారనేది. దీని వెనుక పెద్ద కారణమే ఉంది.
అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి అన్ని వృత్తులు ఒకేలా ఉండవు. ఒక్కొక్క వృత్తికి మరొక వృత్తికి చాలా తేడా ఉంటుంది. పైగా కొన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎక్కువ సమయాన్ని వాళ్ళ వృత్తి కోసమే కేటాయించాల్సి వస్తుంది. అలాగే వైద్యులు కూడా అంతే. వీళ్ళు ఎక్కువగా సమయం ని వృత్తి పై కేటాయించాల్సి వస్తుంది.
ఒక్కొక్క సారి సాధారణ పని వేళలు లో మాత్రమే పని చేయడం కాకుండా నైట్ డ్యూటీ, పండగలు, ఆదివారాలు కూడా పని చేయాలి. రొటీన్ వర్క్ తో పాటుగా సడెన్ గా పని పడుతుంది. కనుక అదే వృత్తి వాళ్ళని ఎంచుకుంటే మంచిది అని డాక్టర్లు అనుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది వాళ్ళ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి డాక్టర్లు డాక్టర్లుని కోరుకుంటారు అందుకే మనం డాక్టర్ల పెళ్లి టాపిక్ వస్తే డాక్టర్ ని చూసి పెట్టమని అంటారు. ఇదే డాక్టర్స్ ని డాక్టర్స్ పెళ్లి చేసుకోవడం వెనుక ఉండే అసలు కారణం.
End of Article