Ads
ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం వేరు. అత్తింట్లో ఉండడం వేరు. అలానే ఆడపిల్ల పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ విధంగా అనుసరిస్తూ ఉండాలి. లేదంటే పుట్టింటి వాళ్ళకి కష్టాలు వస్తాయి. అయితే ఆడపిల్లల్ని పుట్టింటి నుండి అత్తవారింటికి పంపించేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏవి..?,
Video Advertisement
ఎటువంటి రూల్స్ ని ఆడపిల్లలు ఫాలో అవ్వాలి అనే దాని గురించి రోజు మనం చూద్దాం. ఆడపిల్లలు తమకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చిన వస్తువుల్ని తీసుకు వెళ్ళ కూడదు.
ముఖ్యంగా పొరపాటును కూడా ఇంటి ఆడపిల్ల ఇలాంటి వస్తువులని పుట్టింటి నుండి అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో చూడండి.
#1. ఆడపిల్ల అత్త వారి ఇంటికి వెళ్ళినప్పుడు వినాయకుడి విగ్రహాన్ని కానీ లక్ష్మీ దేవి ఫోటోలును కానీ ఇవ్వకూడదు. వినాయకుడి విగ్రహాన్ని లేదా లక్ష్మీ దేవి ఫోటోని కానీ ఇస్తే పుట్టింటి వాళ్ళకి మంచిది కాదు. లక్ష్మి దేవి కలుగదు. అయితే వీటిని కొని ఇవ్వకూడదు కానీ బహుమతిగా వస్తే తీసుకువెళ్ళవచ్చు.
#2. అలానే చీపురుని కూడా ఇవ్వకూడదు.
#3. కత్తులు, కత్తి పీటలు, కత్తెర, సూది వంటి వస్తువులను కాపురానికి వెళ్తున్నప్పుడు తీసుకు వెళ్ళ కూడదు.
#4. అదేవిధంగా ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్ళినప్పుడు నూనె ప్యాకెట్లను కూడా తీసుకు వెళ్ళకూడదు. నూనె తీసుకెళ్తే ఆర్థిక సమస్యల కుటుంబంలో వస్తాయి.
#5. అలానే మహాభారతం ఇవ్వకూడదు. ఎందుకంటే గొడవలు ఎక్కువగా ఉండే గ్రంధాలు ఇస్తే మంచిది కాదని అంటారు. కాబట్టి మర్చిపోయి కూడా ఈ వస్తువులని ఆడపిల్ల అత్త గారి ఇంటికి వెళ్ళినప్పుడు పంపించొద్దు.
అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని ఇవ్వచ్చు. అలానే కృష్ణుడి బొమ్మ కూడా ఇవ్వచ్చు. కృష్ణుడు బొమ్మ ఇవ్వడం వల్ల సంతానం అభివృద్ధి చెందుతుంది. అలానే రామాయణాన్ని కూడా ఇవ్వచ్చు. రామాయణం ఇస్తే భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
End of Article