87
Ads
ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు మనం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులో ఆక్సిజన్ ని శరీరానికి పంపిస్తాయి. దీని వలన శ్వాసక్రియ జరుగుతుంది. మన శరీరంలో చేరే ఆక్సిజన్ తో మనం తిన్న ఆహారం బాడీకి ఫ్యూయల్ కింద మారుతుంది.
Video Advertisement
దీనితో మనకి సామర్థ్యం వస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ ని కూడా ఈ క్రమంలో ఊపిరితిత్తులు బయటికి పంపుతాయి. ఇలా చెడు గాలి బయటకు వెళుతుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. అన్ని రకాల జీవక్రియలు సరిగా జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- బచ్చలికూర, బీట్రూట్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా వీటిని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుతాయి.
- అలానే టమాటా, క్యాప్సికం, కివి, స్ట్రాబెర్రీస్, పైనాపిల్, మామిడి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
- చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. కనుక వారానికి రెండు సార్లు వీటిని తీసుకుంటే కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది.
- క్యారెట్, చిలగడదుంపలు, ఆకు కూరలు కూడా తీసుకోండి. ఇవి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వీటన్నిటిని డైట్ లో తీసుకుని ఊపిరితిత్తుల సమస్య లేకుండా ఉండండి.
End of Article