Ads
మనిషి పుట్టినప్పటి నుంచి ఏజ్ పెరిగినా కొద్దీ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. పుట్టినప్పటీ నుంచి ఐదు సంవత్సరాల వరకు చాలా క్యూట్ గా కనిపిస్తారు. ఇంకా ఏజ్ పెరిగేకొద్దీ కాస్త చేంజ్ అవుతారు. 12 నుంచి 15 ఏళ్ల మధ్యలో మరిన్ని మార్పులు వస్తాయి. 15 నుంచి 25 ఏజ్ లో యువ రక్తంతో ఉరకలు వేస్తారు.. ఇంకా వయసు పెరిగే కొంచెం కొంచెం మనలో మార్పులు చాలా జరుగుతాయి.. ఎత్తు తగ్గడం అనేది ఇందులో ముఖ్యమైంది. అయితే దీనికి ప్రధాన కారణం జన్యు లోపం అనుకుంటారు. కానీ అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి 18-20 ఏండ్ల వరకు మాత్రమే ఎత్తు పెరుగుతారు. ఆ తర్వాత మనం ఎంత ఎత్తు పెరిగితే అంతే ఎత్తుతో 30-40 ఏండ్ల వరకు ఉంటాం. ఆ తర్వాత ఏజ్ లో తగ్గడం మొదలవుతుంది. సైన్స్ ఏ బి సి నివేదిక ప్రకారం చూస్తే.. ఈ వయసు తర్వాత వృద్దాప్యానికి సంబంధించిన అన్ని ప్రభావాలు శరీరంపై కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎత్తు ఉంటుంది. ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత శరీరం కుచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది..
Video Advertisement
30-40 ఏండ్ల మధ్యలో ఎత్తు తగ్గడం ప్రారంభమై 10 సంవత్సరాల పాటు తగ్గుతుంది.. ఒక వ్యక్తి తన పొడవులో పాదాలు, ఎముకలు, పుర్రె పై ఎటువంటి ప్రభావం చూపదు. కానీ వెన్నుపాము పొడవు మాత్రం తగ్గడం ప్రారంభం అవుతుంది. దానిలో ఉన్నటువంటి డిస్క్ సన్నబడడం మొదలవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ మన పొడవు పైనే పడుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి.. అవి ఖనిజ లవణాల కొరత వల్ల సన్నగా మారడంతో వాటి పరిమాణం తగ్గడం మొదలవుతుంది. దీంతో పాటుగా పాదాల్లోని 2 ఎముకల మధ్యలో కదలికలను సులభతరం చేసే లిగమెంట్ కూడా బలహీనంగా అవ్వడం ప్రారంభమవుతాయి. పురుషులు గానీ స్త్రీలు గానీ ఏజ్ పెరిగే కొలది ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది.. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఎత్తు తగ్గుతారు. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
End of Article