Home Filmy Adda “మేజర్” సినిమాలో ఆ సన్నివేశాన్ని ఎందుకు పెట్టలేదు..? రియల్ గా జరిగినా సినిమాలో మాత్రం..?

“మేజర్” సినిమాలో ఆ సన్నివేశాన్ని ఎందుకు పెట్టలేదు..? రియల్ గా జరిగినా సినిమాలో మాత్రం..?

by Anudeep

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో ఈ మేజర్ చిత్రం రూపొందింది. ఈ జూన్ 3వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం విడుదలకు కొంత సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ లో భాగంగా అడివి శేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మీడియాకి వెల్లడించారు. 2008 సందీప్ ఉన్ని కృష్ణన్ మరణం తర్వాత ఆయన ఫొటోలు బయటకు వచ్చాక మా కజిన్ బ్రదర్ నీలో సందీప్ పోలికలు కనిపిస్తున్నాయని తెలిపారు.

Major

సందీప్ ఉన్నికృష్ణన్ మరణం అనంతరం ఆయనకు అశోక చక్ర వచ్చినప్పుడు అతని గురించి చదివిన అతని పెద్ద అభిమానిగా మారాను. క్షణం షూటింగ్ సమయంలో ఆయన బయోపిక్ చేయాలని ఆలోచన వచ్చింది నాలో. గూడచారి చిత్రం సమయంలో ఈ ఆలోచన మరింత బలపడింది అని తెలిపారు.

Also Read : మెగాస్టార్ చిరంజీవికి కమెడియన్ సుధాకర్ కి ఉన్న ఈ రిలేషన్ ఏంటో తెలుసా…

మేజర్ సందీప్ గురించి మీరు లోతుగా వివరాలు తెలుసుకుంటున్న అప్పుడు మీకు ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యాయి అని మీడియా ప్రశ్నించగా, అందుకుగాను అడివి శేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.major sandeep unnikrishnan

సందీప్ ఉన్నికృష్ణన్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరే సమయంలో ట్రైన్ లో ఆయన తో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నారు. ఆ సమయంలో తన స్నేహితుడు నా దగ్గర డబ్బులు లేవు అని అనడంతో సందీప్ తన దగ్గర ఉన్నా డబ్బులు మొత్తం అతనికి ఇచ్చి అస్సాం వెళ్లడానికి సహాయం చేశారు. ఆ తర్వాత సందీప్ దగ్గర డబ్బులు లేకపోవడంతో బెంగుళూరు వరకు ఆయన ఏమీ తినకుండా తాగకుండా పూర్తి ప్రయాణం చేశారు. మేజర్ సందీప్ మిలటరీ వ్యక్తి కాబట్టి ఎవరి సహాయం అడగకూడదని రూల్ ఉంటుంది.

Adavi sesh

ఇలా ఒక స్నేహితుడి కోసం తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం విచ్చేసిన విషయం తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను అని అడివి శేష్ వెల్లడించారు. అయితే ఈ సంఘటన చిత్రంలో పెట్టడానికి ప్రేక్షకులు దీనిని కల్పితం అనుకుంటారని, అందుకే ఆ సంఘటనను తీయలేదు అని అడివి శేష్ వెల్లడించారు.

Also Read: GT Vs RR మధ్య పోరులో ఫైనల్లో “గుజరాత్” టైటిల్ గెలవడం పై 15 మీమ్స్ 

You may also like