Ads
ఈమధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేనండీ హెల్మెట్ వేసుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డాన్స్ చేస్తున్న కుర్రోడు. చూస్తున్నవారు ఇతనికి పిచ్చా, ఇలా నడి రోడ్డు పై డాన్స్ వేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు.
Video Advertisement
ఈ హెల్మెట్ మ్యాన్ మహారాష్ట్రలోని కళ్యాణ్ లో ట్రాఫిక్ కూడళ్ల దగ్గరే కనిపిస్తారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాల ముందుకు వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? సోషల్ మీడియా లో పాపులర్ రావడానికి లేక ఇంకేమైనా కారణం ఉందా అనే విషయం తెలుసుకుందాం.
అతను ఇలా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డాన్స్ వేయడానికి ఒక కారణం ఉందని ఆ కుర్రవాడు చెప్పుకొస్తున్నాడు. ఈయన పేరు సుభోద్ లోంధే. అదేనండి హెల్మెట్ మాన్.
మహారాష్ట్రలోని కళ్యాణ్ లో గత సంవత్సరమే ట్రాఫిక్ సిగ్నల్ అమర్చారు. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగినా.. మళ్లీ తిరిగి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు ఉందామని వాహనదారులు ఆలోచించటం లేదు.
నేను గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు ఆగేటప్పుడు అందరూ అడ్డు తప్పుకోమని అడుగుతూ ఉంటారు. నిబంధనలు అతిక్రమించి రెడ్ సిగ్నల్ వుండగానే ముందుకు వెళ్ళి పోతూ ఉంటారు. సిగ్నల్ వచ్చే వరకు ఆగాలని నేను కావాలని కోరే వాణ్ని. కానీ నా మాట ఎవరు వినేవారు కారు. అప్పుడే నాకు ఒక ఆలోచన పుట్టుకొచ్చింది.
ఆలోచనతో సిగ్నల్ కోసం వెయిట్ చేసేవారికి వినోదం కల్పించాలని అనుకున్నాను. వాళ్లని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే రూల్స్ ని పాటిస్తున్నారు. అప్పటినుంచి నేను ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినప్పుడల్లా దిగి డాన్స్ చేయడం మొదలు పెట్టేవాడిని అంటూ సుభోద్ చెప్పుకొచ్చారు.
ఇలా సుభోద్ చేసిన వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
https://www.instagram.com/reel/CZOX0GRhNCw/?igshid=MDJmNzVkMjY=
End of Article