సినిమాలు శుక్రవారమే ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..!?

సినిమాలు శుక్రవారమే ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..!?

by Anudeep

Ads

శుక్రవారం కోసం సినిమా ప్రేమికులు, సినీ వర్గాలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాయి. తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురు చూసే వారు కొందరైతే.. తాము తీసిన సినిమాను విడుదల చేయడానికి చూసే వారు మరికొందరు. సినిమాతో ముడిపడి ఉన్న ఎంతో మంది జీవితాలు ఒక్క శుక్రవారంతో మారిపోతాయి.

Video Advertisement

అందుకే అంటారు ఇక్కడ ఎవరి జీవితం శాశ్వతం కాదు ప్రతి శుక్రవారం మారిపోతూనే ఉంటుంది అని. అయితే సినిమాలు ఎక్కువగా శుక్రవారమే ఎందుకు విడుదల చేస్తారరో మీకు తెలుసా!? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం..

Also Read:  “ఇంట్లో ఇలాంటి బట్టలు వేసుకోకు…మీ మామ గారు ఉన్నారు”…పెళ్లి తర్వాత నా జీవితం ఎలా మారిపోయిందంటే.?

ప్రస్తుత కాలంలో మనిషి జీవన శైలి.. వారం అంతా కష్టపడి వీకెండ్ లో, ఆ కష్టం అంతా మర్చిపోయేలా సంతోషం గా గడిపేలా ప్రణాళిక సిద్ధం చేసుకునేలా ఉంటుంది. అయితే ఈ వీకెండ్ ఎంజాయ్ మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.  చాలామందికి మాత్రం వీకెండ్ ఎంజాయ్ మెంట్ లో సినిమా కూడా ప్రధానంగా ఉంటుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసి సంతోషంగా గడపాలి అనుకుంటారు నేటితరం యువకులు.

అయితే మన దేశం లో చిత్రాలు అన్నీ దానికి అనుగుణంగానే వారాంతంలో రిలీజ్ అవుతాయి. సాధ్యమైనంత వరకు అన్ని సినిమాలు శుక్రవారమే రిలీజ్ అవుతాయి. అయితే సినీ పరిశ్రమకి ఈ శుక్రవారం సెంటిమెంట్ కి కారణాలు చాలానే ఉన్నాయి అని చెప్పుకుంటారు. 1950 వరకు భారత దేశంలో సినిమాలు శుక్రవారం విడుదల చేసేవారు కాదట. 1950 లో ఇండియాలో శుక్రవారం రిలీజ్ అయిన మొదటి సినిమా “మొఘల్ ఏ అజమ్”.

Also Read:  భాగస్వామి మీ పక్కన ఉన్నప్పుడు.. అబ్బాయిలు చేయకూడని పనులు ఏంటంటే..!?

 

అప్పటి నుండి మన వాళ్లు శుక్రవారం సినిమా విడుదల చేయడం మొదలు పెట్టారు. ఈ సంస్కృతి మన వాళ్ళు అమెరికన్ల దగ్గర నుండి అరువు తెచ్చుకున్నట్టు చెబుతుంటారు. అంతే కాకుండా ముంబైలో అప్పట్లో శుక్రవారం మధ్యాహ్నం చిన్న తరహా పరిశ్రమల్లో సెలవు ప్రకటించేవారట. వారందరికీ కాలక్షేపంగా కూడా అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఉండేవట.

అంతేకాక మన దేశంలో శుక్రవారం అంటే.. లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన రోజు గా భావిస్తారు. అందుకే ప్రొడ్యూసర్ లు ఆ రోజు సినిమా విడుదల అయితే తమకి తప్పక లాభాలు వస్తాయనే నమ్మకంతో శుక్రవారం రోజున తమ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అంతేకాదు శుక్రవారం మూవీ రిలీజ్ అయితే ఆయా హీరోల అభిమానులు అప్పటికే చూసి ఉండడంతో మూవీ టాక్ వచ్చేస్తుంది.

దాన్ని బట్టి వీకెండ్ మూవీకి వెళ్ళడానికి ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. మల్టీ ఫ్లేక్స్ థియేటర్ ఓనర్లకి, ప్రొడ్యూసర్లు తమ సినిమాలు ఆడించే నిమిత్తం, చెల్లించే అద్దెలు మిగిలిన రోజులతో పోలిస్తే శుక్రవారం తక్కువ గా ఉంటాయట. అందుకే మన దేశంలో సినిమాలు మిగిలిన రోజుల కంటే, శుక్రవారం విడుదల చేయడమే శ్రేయస్కరం అని ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు భావిస్తారు.

 

Also Read:   గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వేటి గురించి వెతుకుతారో మీకు తెలుసా..?


End of Article

You may also like