గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వేటి గురించి వెతుకుతారో మీకు తెలుసా..?

గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వేటి గురించి వెతుకుతారో మీకు తెలుసా..?

by Mohana Priya

Ads

గూగుల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ లో మనకు తెలియని విషయాలు సెర్చ్ చేసి ఎంతో ఈజీగా తెలుసుకోవచ్చు. చిన్నచిన్న అనుమానాలు ఏవైనా ఉంటే కూడా క్లారిటీగా మనం తెలుసుకోవచ్చు. అయితే తాజాగా గూగుల్ ఇటీవలే ఒక సర్వే రిపోర్ట్ ని విడుదల చేసింది. అయితే ఈ రిపోర్టు ద్వారా మహిళలు ఎక్కువగా ఏ విషయాలను గూగుల్ లో సెర్చ్ చేస్తారు అనేది గూగుల్ వెల్లడించింది. మరి వాటి కోసమే ఇప్పుడు మనం చూద్దాం.

Video Advertisement

15 కోట్ల ఇంటర్నెట్ యూజర్ల లో దాదాపు 6 కోట్ల మంది మహిళలే. ఈ మధ్య కాలం లో చాలా మంది మహిళలు ఇంటర్నెట్ ని వాడతారు.

చక్కగా జీవితాన్ని మార్చుకోవడానికి, కొత్త విషయాలని తెలుసుకోవడానికి, రానివి నేర్చుకోవడానికి ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇంటర్నెట్ ని వాడుతున్నారు. ఇలా ఇంటర్నెట్ ని వాడే వారిలో 75 శాతం మంది వయసు 15 నుండి 34 వరకు ఉంటుంది. మరి వారు ఎలాంటివి సెర్చ్ చేస్తున్నారో ఇప్పుడే చూసేద్దాం.

మహిళలకి గోరింటాకు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గూగుల్ కూడా ఈ విషయాన్ని చెప్పేసింది. ఎక్కువ మంది గోరింటాకు డిజైన్లు గురించి సెర్చ్ చేస్తారట.
అలాగే అమ్మాయిలకి పాటలు అంటే కూడా ఇష్టం. అమ్మాయిలు ఎక్కువగా రొమాంటిక్ పాటలు, రొమాంటిక్ కవితల కోసం వెతుకుతారట.
అదే విధంగా అందరి కంటే భిన్నంగా ఉండడం కోసం.. అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం.. ఇంటర్నెట్ ని చాలా మంది అమ్మాయిలు వాడుతున్నట్లు గూగుల్ రిపోర్ట్ వెల్లడించింది.

ఆన్లైన్ షాపింగ్ సైట్ లను కూడా అమ్మాయిలు ఎక్కువగా చూస్తారు. బట్టలు, డిజైన్లు, కొత్త కలెక్షన్స్ వంటి వాటిని కూడా అమ్మాయిలు సెర్చ్ చేస్తారు.
ఏ కెరీర్ ఎంచుకోవాలి, ఏ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా అమ్మాయిలు వెతుకుతూ ఉంటారు అని గూగుల్ రిపోర్ట్ చెప్పింది.


End of Article

You may also like