Ads
మన స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది గొప్ప యోధులు ఉన్నారు. అందులో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సంపాదించగలము అని నమ్మి బ్రిటిష్ వారిని 27 ఏళ్ల వయసులోనే ఢీ కొట్టిన మహాశక్తి.
Video Advertisement
ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలోనే ప్రజా శక్తిని కూడగట్టుకొని బ్రిటిష్ వారికి ఎదురు వెళ్లారు. ఈయన ఒక మహా ఉద్యమ వీరుడుగానే మన అందరికీ తెలుసు అయితే ఇంత గొప్ప వీరుడికి ఒక ప్రేమ కథ ఉన్న విషయం ఇప్పటివరకు మనలో చాలా మందికి తెలియదు. సీతారామరాజు గారికి ఆ రోజుల్లో ఒక ప్రేమకథ ఉంది.
ఆయన అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. సీతారామరాజు పేరులోని సీత గురించి రెండు కథలు వినిపిస్తున్నాయి. సీత ఆయన సొంత చెల్లెలు అని, ఆమె భర్తను చిన్న వయసులోనే ఉద్యమ పోరాటంలో కోల్పోయింది. ఈ విషయం ఆయనను ఎంతగానో కలిచివేసింది. అందుకే శ్రీరామరాజు పేరుకు ముందు శ్రీ తొలగించి సీత అని పెట్టుకున్నారు అని ఒక కథ అయితే, మరొక కథ ఆయన ప్రేమకు గుర్తుగా తన ప్రేయసి అయిన సీత పేరును తన పేరుతో కలుపుకుని అల్లూరి సీతారామరాజు అని పెట్టుకున్నారు అని మరొక కథ వినిపిస్తుంది.
ఈ పేరు ఇప్పటికికూడా అందరి మదిలో నిలిచింది. విశాఖపట్నంలో చదువుకొనే రోజుల్లో ఆయన 16 సంవత్సరాలు. యవ్వనంలో అడుగుపెడుతూనే ఆయన మదిలో ఒక యువతి నిలిచిపోయింది. ఆమెనే సీత. ఆమె వెలమ కులానికి చెందిన శ్రీమంతుడు కూతురు కావడంతో వారిరువురి మధ్య స్థితిగతుల భేదం వల్ల విడిపోయారని, అందువల్లనే వాళ్ళ వివాహం జరగలేదని కథలుగా చెప్పుకుంటారు.
అందువల్లనే ఆమెను మర్చిపోలేక ఆమె పేరును రామరాజు పేరుతో జత కలుపుకొని సీతారామరాజు అయ్యారాంటారు. ఆమె కోసం రామరాజు భగ్న హృదయం తో బాధపడ్డారని చెబుతుంటారు. ఆమె కోసమే తుదిశ్వాస వరకూ కఠోర బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉండిపోవడానికి ఈ ప్రేమ కూడా ఓ కారణంగా చెప్పుకొస్తారు. ఆయన దేశభక్తికే కాదు, నిజమైన ప్రేమ కూడా మనం జోహార్లు చెప్పవచ్చు.
End of Article