Ads
వుడ్ పైన పెయింట్ చేసి ఉన్న ఈ ఫొటోను చూస్తే మీ సహనం ఎంత ఉందో చెప్పొచ్చు. అంతే కాదు ఈ దృష్టి ద్వారా మీ వ్యక్తిత్వ ఎలాంటిదో కూడా తెలుసుకోవచ్చు. ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఈ దృష్టిభ్రాంతి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. అంటే మీరు ముందు జాగ్రత్త కలిగిన వాళ్ళా? లేక పోతే టైం వచ్చినప్పుడు చూసుకుందాం లే అనుకునేవారా? అనేది తెలుస్తుంది.
Video Advertisement
కాగా ఆప్టికల్ ఇల్యూజన్ అనేది త్వరగా అంతరించిపోని ధోరణిగా మారాడంతో… ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ నిర్మాతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఆప్టికల్ ఇల్యూజన్(బ్రమ) అనేది ఎలా పని చేస్తుంది అంటే. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాగా బాగా తెలివైనదిగా పని చేస్తున్నప్పటికీ కొన్ని అర్థం చేసుకోలేక పోతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఇకపోతే మన మెదడుకి మన కళ్లు కేవలం ఒక సోర్స్ మాత్రమే. నిజానికి బ్రెయిన్ కి తెలిసిన వాటిని, కళ్ళ రూపంలో చూస్తుంది. అంటే ఉదాహరణకి ఆరెంజ్ పండు ఆరెంజ్ కలర్ లో ఉంటుందని మన మెదడుకి తెల్సు. కానీ అలా కాకుండా బ్లూ కలర్ ఆరెంజులను చూపిస్తే మన మెదడు తొందరగా అంగీకరించదు. అంతే కాకుండా దీని ద్వారా వచ్చే స్పందన కూడా సరిగ్గా ఉండదు. ఇదే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ లో జరిగేది.
ముందుగా ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ను ఒక 7 సెకండ్లు పరిశీలించి మీకు ఏమి అనిపిస్తుందో చెప్పండి. 7 సెకండ్లు ఎందుకు అంటే, ఫస్ట్ టైం చూడగానే, 7 సెకండ్లలోనే ఇమేజ్ పైన మన మెదడు దృష్టి ఎలా ఉందో తెలుసుకోడానికి, ఆప్టికల్ ఇల్యూజన్ ప్రక్రియ లో భాగంగా ఆ సమయాన్ని కౌంట్ చేస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాన్ని చూడండి. ఒక చెట్టు కింద పడుకున్న పులి దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో. ఇంతకీ ఇందులో మొదట మీరు ఏమి చూసారు? కేవలం చెట్టుని చూసారా? లేక చెట్టు మీద ఉన్న పులిని చూసారా? లేక చెట్టు కింద పడుకున్న పులిని చూసారా? ఇది తెలుసుకోవాలంటే ముందు ఈ పరిశీలనను చూడండి:
1. కేవలం చెట్టుని చూసి ఉంటే..
మీరు చాలా అదృష్టంతులు. మీరు ఎలాంటి వారంటే ప్రతీ దాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. హ్యాపీ గా ఉన్న సమయాన్ని గడుపుతారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం ఉండదు. దేనినీ ఎక్కువగా పట్టించుకోరు. కానీ దారి అర్థం మీరు నిర్లక్ష్యం ఉన్నవారు కాదు. ఆ సమయాన్ని బట్టి ఏది ఎలా మేనేజ్ చెయ్యాలో బాగా తెలిసిన వారు.
2. చెట్టు మీద పులి ముఖం చూసారా?
దీని బట్టి మీరు చాలా ముందు జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. ఏ పనైనా మొదలు పెట్టేముందు ఆచి తూచి, ముందు వెనక చూసుకుని, అన్నీ సరిగ్గా ఉన్నయ్యో లేదో చూసుకుని చేస్తారు. ఎక్కువగా ముందు ప్లాన్లు వేసుకుని దాని ప్రకారం నడవాలి అనుకుంటారు. ఇది ఒకందుకు మంచిదే కానీ, మీరు ఓటమిని ఏడురుకోవడానికి భయపడతారు.
3. ఒకవేళ చెట్టు కింద పులి పడుకోవడం చూసి ఉంటే
మీ జీవితంలో సరైన అవకాశం కోసం చూస్తున్నారు. ఎలాంటి అవకాశాన్ని అయినా వొదులు కోవడానికి ఇష్టపడరు. ప్రతీ చిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు.
ఇక ఇదండీ ఈ ఫోటోపై ఆప్టికల్ ఇల్యూజన్ ద్వారా మనిషి గురించి, తమ వ్యక్తిత్వం గురించి ఎలా తెలుస్తుందో అర్థం అయ్యింది కద. ఇది ఒక మనిషి గురించిన కొత్త విషయాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ టెస్టులు నిజంగా వొంద శాతం నిరూపించినవి కావు. కేవలం ఇవి సరదా కోసం చదువుకోడానికి ఉపయోగపడుతాయి.
End of Article