నెలలో కొడుకుకి 1.5 లక్షలు పంపడం కోసం…రోడ్డుపై దోశలు వేస్తున్న సీరియల్ నటి.! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్స్.!

నెలలో కొడుకుకి 1.5 లక్షలు పంపడం కోసం…రోడ్డుపై దోశలు వేస్తున్న సీరియల్ నటి.! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్స్.!

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీ అనగానే అదొక రంగుల ప్రపంచం లా కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ లో ఉండే నటీనటులందరూ ఎక్కువ మొత్తాల్లో డబ్బులు వెనకేసుకొని లగ్జరీ లైఫ్ ని గడుపుతూ ఉంటారని మనమంతా అనుకుంటాం.

Video Advertisement

కానీ, అందరి జీవితాలు అలా ఉండవు. సినీ ఇండస్ట్రీ లో పైకి కనిపించే ప్లాస్టిక్ నవ్వుల నటన వెనుక, కన్నీరు పెట్టించే గాధలు కూడా ఉంటాయి. అందుకు ఇపుడు మనం చెప్పుకోబోయే సీరియల్ నటి జీవితమే ఉదాహరణ.

serial actress kavitha lakshmi

ఈమె కవితా లక్ష్మి అనే సీరియల్ ఆర్టిస్ట్. మలయాళం లో చాలా సీరియల్స్ లో నటించి తక్కువ సమయం లోనే ఫేమస్ అయ్యారు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఆమె “శ్రీ ధనం” అనే సీరియల్ లో శాంత పాత్రలో నటించారు. ఈ పాత్ర ఆమెకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఆమెను అదృష్టం మాత్రం వరించలేదు. పైకి చెప్పుకోవాటానికి స్టార్ అయినా ఆమె వ్యక్తిగత జీవితం లో కష్టాలు తప్పలేదు. ఆమె భర్తతో పదమూడేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన పిల్లల బాగోగులు కూడా చూసుకుంటున్నారు.

serial actress kavitha lakshmi

కవితా లక్ష్మి కొడుకు బ్రిటన్ లో చదువుకుంటున్నాడు. బ్రిటన్ లో అయితే చదువు బాగుంటుందని, అక్కడ పార్ట్ టైం చేస్తూ చదువుకోవచ్చని …కొడుకుని బ్రిటన్ కు పంపించింది. అతను పార్ట్ టైం చేస్తున్నప్పటికీ, డబ్బులు చాలాకపోవడం తో.. అతనికి అవసరమైన సాయాన్ని కూడా కవితా లక్ష్మే పంపాల్సి వస్తోంది.

serial actress kavitha

ఆమె తన కొడుకుకి నెలకు ఒకటిన్నర లక్ష రూపాయలు పంపించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె కేరళ, తమిళనాడు మధ్య నేషనల్ హై వే 66 పై రోడ్డు సైడ్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాంటిది నడుపుతున్నారు. దోసలు, ఆమ్లెట్లు మరియు గొడ్డు మాంసం కూరలను ఆమె రోడ్డు పై వెళ్లే కస్టమర్లకు అందిస్తున్నారు. లక్ష్మి కుమారుడు ఆకాష్ కృష్ణ ఏడాది క్రితం యుకె లో ఓ కోర్సులో చేరాడు. అయితే, అది ఊహించినదానికంటే ఎక్కువ ఖర్చు ఉండడం తో.. ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

kavitha lakshmi

“నెలకు 1.5 లక్షలు పంపించాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. వాయిదా పధ్ధతి లో పంపించడానికి బ్యాంకు ల వద్ద రుణాలు తీసుకుందామనుకున్నాను. కానీ, తాకట్టు పెట్టుకోవడానికి నా దగ్గర భూమి, ఇల్లు వంటి ఆస్తులు లేకపోవడం వలన బ్యాంకు వారు నాకు ఋణం ఇవ్వలేదు. ఓ ప్రైవేట్ సంస్థలో నాకు చిట్ ఫండ్ ఖాతా ఉన్నప్పటికీ.. దాని గడువు పూర్తి కానీ కారణం గా వారు నాకు సొమ్మును ఇవ్వడానికి అంగీకరించలేదు. ” అంటూ కవితా లక్ష్మి చెప్పుకొచ్చారు.

ఆమె చేతిలో ప్రస్తుతం రెండు సీరియల్స్ మాత్రమే ఉన్నాయి. వాటితో వచ్చే డబ్బులు వారి కుటుంబానికే సరిపోతాయి. కొడుకు కు కూడా పంపించాల్సిన అవసరం ఉండడం తో ఆమె పార్ట్ టైం గా రాత్రి పూట దోశలు వేస్తూ రోడ్డు పై అమ్ముతున్నారు. టీవీ, సినిమా ప్రపంచం లో జీవితాలన్నీ విలాసవంతం గా ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాము. కానీ, చాలా మంది జీవితాలు అందుకు విరుద్ధం గా ఉంటాయి.

serial actress kavitha 2

“విలాసవంతమైన జీవితం కన్నా.. నాకు నా పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రోత్సహించడమే ముఖ్యం” అంటూ కవితా లక్ష్మి నవ్వుతు చెప్తారు. నా పని నేను చేసుకోవడం లో తప్పేమి లేదు కదా అని నవ్వేస్తారు. తన కుటుంబం కోసం ఆమె ఇంతలా కష్టపడుతుండడం చూసి నెటిజన్లు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

 


End of Article

You may also like