Home Sports Adda కోహ్లీ – సూర్య … IPL లో అలా.? ఇప్పుడేమో ఇలా.?

కోహ్లీ – సూర్య … IPL లో అలా.? ఇప్పుడేమో ఇలా.?

by Anudeep

నిన్న మ్యాచ్ లో సూర్య కుమార్ అతన బ్యాట్ ని 360 డిగ్రీలలో తిప్పుతూ గ్రౌండ్ లో బౌలర్ ను ఫీల్డర్స్ ను పరుగులు పెట్టించాడు. నిన్న అతని దూకుడుకి ప్రత్యర్ధులు గగ్గోలు పెడుతుండగా, విరాట్ కోహ్లీ మాత్రం తన సహచరుడి బ్యాటింగ్ ప్రదర్శన కు మెచ్చి చేసిన సంజ్ఞ ఇప్పుడు సోషల్ మీడియా లో చకర్లు కొడుతుంది.

చాలా కాలం క్రితం ఐపీఎల్ 2021 సందర్భంగా ఈ ఇద్దరు క్రికెటర్లు తమ తమ ఐపీఎల్ జట్లకు ఆడుతున్నప్పుడు – ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు, అనుకోకుండా ఇద్దరి మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది. కీలకమైన సమయంలో తన జట్టును గెలిపించి.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు సూర్య.

kohli and surya kumar yadav then and now pictures going viral

ఆనాటి మ్యాచ్‌లో సూర్య కోహ్లీ ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం చోటు చేసుకోగా సూర్యకుమార్‌ దానికి ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిచ్చి కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. అప్పట్లో సూర్యకుమార్‌ ఫ్యాన్స్‌….ఆ గొడవ కారణంగానే సూర్య కు టీమ్ ఇండియా లో చోటు దక్కలేదని విరాట్ పై ట్రోల్‌ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

kohli and surya kumar yadav then and now pictures going viral

కానీ నిన్న సూర్య 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు పూర్తి చేశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 6, 0, 6, 2 బాది 26 పరుగులు చేసి హాంగ్ కాంగ్ టీమ్ కు వణుకు పుట్టించి మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ కు ఫిదా అయిన టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ ” టేక్‌ ఏ బో” అన్నట్లుగా తలవంచి సూర్యకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇది నెట్ లో వైరల్ గా మారింది. ఇది చూసి కోహ్లీ అభిమానులు ” హుందాతనానికి మారుపేరు మా కింగ్‌.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించావు భయ్యా. సూర్య భాయ్‌కు కూడా శుభాకాంక్షలు” అంటూ తమ శుభాకాంక్షలు తెలిపారు.

కానీ కొంతమంది మాత్రం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పాత ఫోటో తో కొత్తది జత చేసి.. ‘‘అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా….”, ” దేశానికి ఆడినప్పుడు ఒకలా.. ఫ్రాంఛైజీకి ఆడినపుడు మరొకలా.. ఇదేం పద్ధతి’’ అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ….తాజా మ్యాచ్‌లో టీమిండియా హాంగ్‌ కాంగ్‌పై విజయం సాధించి సూపర్‌-4కు అర్హత సాధించడం మాత్రం అందరూ హర్షించదగ్గ విషయం. ఇకముందు రాబోయే అన్ని మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా తన అద్భుత పర్ఫామెన్స్ ని ఇచ్చి ఇలాగే దూసుకు వెళ్తుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

You may also like