“అర్షదీప్ సింగ్” నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఓడిపోవడానికి ఈ 5 మంది కూడా కారణమేగా.?

“అర్షదీప్ సింగ్” నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఓడిపోవడానికి ఈ 5 మంది కూడా కారణమేగా.?

by Anudeep

Ads

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికి చాలా ఆసక్తి. చిరకాల ప్రత్యర్థులైన ఇరు జట్లు గెలుపు కోసం కసిగా ఆడతాయి. అలాగే నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా పోటా పోటీగా ఆడారు. మ్యాచ్ లో భారత్ కే గెలిచే అవకాశాలున్నాయి. కానీ ఓటమి పాలయ్యింది. దీనికి బాధ్యులు ఎవరు?..

Video Advertisement

ఆసియా కప్లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో భారత్ పై పాక్ విజయం సాధించింది. అయితే చివరి ఓవర్లలో బ్యాటర్ అసిఫ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను పేసర్ అర్షదీప్ జారవిడిచారు. ఆ తర్వాత అసిఫ్ బౌండరీలతో చెలరేగిపోయాడు. అర్షదీప్ క్యాచ్ ను వదిలేయడంతో కెప్టెన్ రోహిత్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. రోహిత్ తీరు పై ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్నారు.

who is the reason for india's loss
క్యాచ్ ను వదిలేసినా అర్షదీప్ పై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. పలువురు మాజీలు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
సునాయాసం గా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓటమికి కారణాలేంటో చూద్దాం..

# ఓపెనర్లు విజృంభించినా మిడిలార్డర్ చతికిల పడింది.

# లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కోసం దినేష్ కార్తీక్ బదులు పంత్ ను తీసుకున్నారు. కానీ క్రీజ్ లో కుదురుకున్నట్లే కనిపించిన పంత్ రివర్స్ స్వీప్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

who is the reason for india's loss

# గ్రూప్ దశలో పాక్ తో జరిగిన మ్యాచ్ లో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన పాండ్య చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు.

# సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కూడా 19 వ ఓవర్లో 19 పరుగులిచ్చేయడంతో పాక్ కు గెలుపు సులభమైంది.

who is the reason for india's loss
# చాహల్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

# భారత్ ఓపెనింగ్ బ్యాటర్ లు శుభ ఆరంభాని ఇచ్చినా, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా విఫలమవడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది.

# బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ ప్రదర్శన పేలవంగా ఉంది.

who is the reason for india's loss
# అసిఫ్ క్యాచ్ ను అర్షదీప్ వదిలెయ్యడం

కీలక సమయంలో అర్షదీప్ అసిఫ్ క్యాచ్ వదిలెయ్యడం భారత్ ఓటమికి ఒక కారణమే కానీ పూర్తి బాధ్యత అతడిదే అని ఎలా అంటారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


End of Article

You may also like