Ads
మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకి సిటి స్కాన్ చేస్తారు కదా. అదేవిధంగా పురాతన వస్తు శాఖ వాళ్లు వాళ్లకి ఏదైనా పురాతనమైన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటి స్కాన్ చేస్తారు.
Video Advertisement
అదేంటి విగ్రహాన్ని ఎందుకు స్కాన్ చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే విగ్రహం లోపల ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అలా స్కాన్ చేస్తారు.
నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఆ విగ్రహం లో ఒక మనిషి శవం ఉందట.
ఆ శవం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందటిది. ఈ విషయం తెలిసి శాస్త్రవేత్తలు విగ్రహం లో శవం ఉండడం ఏంటి అని షాక్ అయ్యారు. తర్వాత పరిశీలన చేస్తే ఆ మనిషి శవం దాదాపు 11వ శతాబ్దం లేదా 12వ శతాబ్దానికి చెందినది అని తెలిసింది.
మమ్మీ సినిమా లో ఉన్నట్టు శవానికి మొత్తం వస్త్రం చుట్టేసి ఉందట. ఆ వస్త్రం మీద చైనీస్ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయట. దాంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలించి ఆ శవం లిక్వాన్ అనే అతనిది అని గుర్తించారు. లిక్వాన్ చైనా మెడిటేషన్ స్కూల్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి. ఆ విగ్రహం ఇంకా పరిశీలన లోనే ఉంది.
End of Article