Ads
సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. అయితే నిద్రపోయినప్పుడు వచ్చే కలలు మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి భయంకరమైన పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనం ఏదో సాధించినట్లు కలలు వస్తాయి.
Video Advertisement
ఎక్కువగా ఉద్యోగం గురించి ఆలోచించే వాళ్లకి ఉద్యోగం వచ్చినట్లు కలలు వస్తాయి. అదే విధంగా బాగా చదువుకునే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు కలలు వస్తాయి.
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం నిద్ర లో వచ్చే కలలు నిజ జీవితాన్ని బట్టి ఉంటాయట. కల లో జంతువులు కూడా చాలా మందికి కనబడుతూ ఉంటాయి. మరి మీకు కూడా ఎప్పుడైనా జంతువులు కనపడ్డాయా..? ఏ జంతువులు దేనికి సంకేతం అనేది ఇప్పుడు చూద్దాం.
కలలో కనక ఏనుగు కనబడితే అది ఎంతో మంచిది. శుభ సూచకమని స్వప్న శాస్త్రం అంటోంది.
అదే ఒకవేళ మీ కల లో గుర్రం కనబడితే అది మీ వ్యాపారం మరియు కెరీర్ ని ముందుకు తీసుకు వెళుతుంది అని దానికి అర్ధం.
ఒకవేళ కలలో ఆవు కనబడితే పురోగతి మార్గం లో మీరు ముందుకు వెళ్ళడానికి అని సూచిస్తుంది.
అదే ఒకవేళ కలలో కనుక ఎలుగుబంటి కనపడితే.. ఏదైనా శుభవార్తను మీరు త్వరలో వింటారు అని అర్థం.
కల లో కనుక కుందేలు కనబడితే జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా ఉంటారని అర్థం.
అదే మీ కలలో కనుక సింహం కనబడితే మీకు విజయం తధ్యమని స్వప్న శాస్త్రం అంటోంది.
జీబ్రా కనుక మీ కలలో కనబడితే మీకు కొత్త రోజులు రాబోతున్నాయని… రానున్న రోజుల్లో ఏదో మంచి జరుగుతున్నట్టు దానికి అర్థం.
అయితే అందరికీ ఒకేలా కలలు రావు. ఆలోచనలు, నిజ జీవితాన్ని బట్టి వస్తాయి కనుక మంచిగా ఉండాలి. చక్కగా పాజిటివ్ గా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే ఆనందంగా ఉండచ్చు. నిద్ర కూడా బాగా పడుతుంది.
End of Article