హోటల్స్ లో మనం వాడి వదిలేసిన “సోప్స్” ఏమవుతాయో తెలుసా.? ఏం చేస్తారు అంటే.?

హోటల్స్ లో మనం వాడి వదిలేసిన “సోప్స్” ఏమవుతాయో తెలుసా.? ఏం చేస్తారు అంటే.?

by Megha Varna

Ads

మనం ఏదైనా హోటల్ లో స్టే చేసాం అంటే మనకి సబ్బులను, షాంపూలను మొదలైనవి ఇస్తుంటారు. అయితే రోజుకి హోటల్స్ లో చాలామంది వస్తూ పోతూ ఉంటారు. సబ్బుని ఉపయోగించి మళ్లీ తిరిగి హోటల్ కి వచ్చిన వాళ్ళు అక్కడ వదిలేస్తూ ఉంటారు. ఎ

Video Advertisement

ప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఉపయోగించిన సబ్బులని హోటల్ వాళ్ళు ఏం చేస్తారు అని… అయితే హోటల్ కి వచ్చిన వాళ్ళు ఉపయోగించిన సబ్బులను హోటల్ వాళ్ళు ఇలా చేస్తారట.

దీని వల్ల సబ్బులు వృధా అవ్వవు. ఇక మరి హోటల్ వాళ్ళు వాటిని ఏం చేస్తారు..?, ఎలా ఉపయోగిస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని హోటల్స్ లో అయితే వాటిని పడేస్తారు కానీ కొన్ని హోటల్స్ లో మాత్రం సగం ఉపయోగించిన సబ్బులను కంపెనీలకు పంపిస్తారట.

ఉదాహరణకు ”క్లీన్ ద వరల్డ్” అని ఒక కంపెనీ ఉంది. హోటల్ వాళ్ళు అక్కడికి పంపిస్తాయి. అయితే ఆ కంపెనీలు హోటల్స్ లో వాడేసిన సబ్బులను తీసుకుని కరిగించి కొత్త సబ్బులను తయారు చేస్తాయి. క్లీన్ ద వరల్డ్ చాలా మంచిగా పని చేస్తుంది. 2016లో చూసుకున్నట్లయితే.. ఏడు మిలియన్ల సబ్బులను తయారుచేసింది. అలానే నాలుగు లక్షల హైజీన్ కిట్స్ ని కూడా తయారు చేసింది. వీటిలో ఐదు లక్షల సోప్స్ ని హరికెన్ లో ఎఫెక్ట్ అయిన వారికి పంపించారు.

ఈ కంపెనీ సగం ఉపయోగించిన సాంపూల మీద కూడా పనిచేస్తుంది. అలానే బాడీ వాష్, కండిషనర్లు మీద కూడా ఈ కంపెనీ పని చేస్తుంది. ఇలా పని చేసే కంపెనీలు ఈ బాటిల్స్ ని కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేస్తారు. పైగా కొన్ని కంపెనీలు టూత్ పేస్ట్. టూత్ బ్రష్ లని కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళకి, నిరుపేదలకు ఇటువంటివాటిని విశ్వవ్యాప్తంగా ”క్లీన్ ద వరల్డ్” పంపిణీ చేస్తోంది.

కొన్ని హోటల్స్ లో అయితే సబ్బులన్నిటినీ తీసుకుని టాయిలెట్స్ ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారట. కొన్ని హోటల్ వాళ్ళు కిచెన్లో ఉపయోగించే నూనెని కూడా మళ్ళీ రీసైక్లింగ్ కంపెనీలకి పంపిస్తారు. మరి కొన్ని హోటల్స్ అయితే ఉపయోగించిన బల్బులుని కూడా రీసైక్లింగ్ కి పంపిస్తారట. హోటల్ వాళ్ళు ఇలా కంపెనీలకు ఇస్తే తిరిగి కంపెనీలు వీరికి డబ్బులు చెల్లిస్తారట. పైగా రీసైక్లింగ్ చేయడం నిజంగా పర్యావరణానికి ఎంతో మంచిది.


End of Article

You may also like