Ads
మనం ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు వున్నా తక్కువ బరువు వున్నా కూడా సమస్యలే. కరెక్ట్ గా మనం ఎంత బరువు ఉండాలో అంతే బరువు ఉండాలి. అధిక బరువు వలన ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
Video Advertisement
మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? అధిక బరువు సమస్య నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే. చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వీటివలన చిక్కుల్లోపడతారు.
#1. లేట్ నైట్ డిన్నర్ తీసుకోకండి:
అర్ధరాత్రి పూట ఆకలేసిందనో లేదంటే ఏదైనా తినాలనిపించదనో చాలామంది నచ్చిన ఆహారపదార్థాలను తినేస్తుంటారు. దీనివలన యాసిడ్ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పై కూడా ప్రభావం చూపిస్తుంది.
#2. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి:
సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కూరగాయలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి కచ్చితంగా సమతుల్యమైన ఆహారం పదార్థాలను తీసుకోవాలి.
#3. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను తీసుకోండి:
ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ వంటివి చాలా మంచిది. హై సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్స్ కి ఇవి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని తీసుకోండి.
#4. రాత్రి ఆల్కహాల్ తీసుకోకండి:
రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆల్కహాల్ ను కూడా రాత్రిపూట తీసుకోకండి.
#5. రాత్రిపూట ఆహారం లైట్ గా తీసుకోండి:
వీలైనంత వరకు ఆహార పదార్థాల్ని లైట్ గా తీసుకోండి. మీకు నచ్చిన వంటకాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తీసుకోవద్దు. దాని వల్ల సమస్యలు కలుగుతాయి కనుక రాత్రిపూట తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోండి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు. మీయొక్క బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.
End of Article