Ads
మనం ఎలా అయితే శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెడతామో అదే విధంగా మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెడితే మంచిది. చాలామంది తరచూ మరచిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిజానికి అటువంటి వాళ్ళు పెద్ద విషయాలను చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు.
Video Advertisement
అలా కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఈ ఆహార పదార్థాలతో మనం సులభంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు:
#1. కెఫిన్:
కెఫిన్ ని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. బ్రెయిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
#2. గ్రీన్ టీ:
ఇది కూడా జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవడానికి సహాయపడుతుంది. చాలామంది గ్రీన్ టీ తాగడం వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గుతాము అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే అమైనో యాసిడ్ యాక్టివిటీ ని పెంచేసాయి.
#3. పసుపు:
పసుపు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపుని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. డిప్రెషన్ కూడా తగ్గుతుంది.
#4. వాల్ నట్స్:
ఇందులో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ మరియు హార్ట్ హెల్త్ కి ఇది చాలా సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి కూడా దీనితో మనము పెంచచ్చు.
#5. బ్రోకలీ:
బ్రోకలీను తీసుకోవడం వల్ల కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు.
#6. గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజలు కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, కాపర్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీని కూడా ఇవి బూస్ట్ చేస్తాయి.
#7. గుడ్లు:
గుడ్లు కూడా జ్ఞాపకశక్తిని మెరుగు పరచడానికి సహాయపడతాయి. డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలన కూడా దూరం చేస్తాయి.
End of Article