చాణక్య నీతి: అటువంటి వారికి ఏ చదువైనా వ్యర్ధమే…విజయాన్ని చేరుకునేందుకు చక్కటి సూత్రాలు..!

చాణక్య నీతి: అటువంటి వారికి ఏ చదువైనా వ్యర్ధమే…విజయాన్ని చేరుకునేందుకు చక్కటి సూత్రాలు..!

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు చెప్పినట్టుగా అనుసరిస్తే సమస్యలే రావుట. పైగా చాణక్యుడు చెప్పినట్టే నడుచుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది. ఈరోజు చాణక్య చెప్పిన ముఖ్యమైన విషయాలను చూద్దాం.

#1. మంచి విషయాలను ఆచరించాలి:

ఎలా అయితే మంచి ఆహారం తీసుకోకపోతే అది విషంగా మారుతుందో అలానే మంచి విషయాలను అనుసరించకపోతే గ్రంథాలలోని జ్ఞానం కూడా పనికి రాదని అంటున్నారు చాణక్య. ఇది కూడా విషం లానే ప్రాణాంతకం అవుతుందని అన్నారు చాణక్య.

#2. అభ్యాసాన్ని వదులుకోకూడదు:

అభ్యాసం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా అభ్యాసాన్ని వదులుకోకూడదు.

#3. సాధన:

సాధన ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. సాధన చేసారంటే సమస్యలు వుండవు. ఎందుకంటే సాధనతో సమస్యలను మనం పరిష్కరించుకోవడం సులభమట. సాధన మధ్యలోనే వదిలేయడం మంచి పని కాదు. ఇలా చేస్తే అది విషంలా మారుతుంది.

#4. శ్రమిస్తేనే విజయం:

ఏ వ్యక్తి అయినా సరే విజయం సాధించాలంటే శ్రమించాలి. అలానే భవిష్యత్తు విద్యాభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది అని ఆచార్య చాణక్య అన్నారు.

#5. వీళ్ళకి ఏ చదువైనా వ్యర్ధమే:

ఎప్పుడు కూడా పనులను చేసుకునేటప్పుడు సరిగ్గా సమయానికి చేసుకోవాలి. కానీ చాలా మంది ప్రతీ పనిని వాయిదా వేస్తూ వుంటారు. అయితే ప్రతీ పనిని వాయిదా వేసే వారికి ఏ చదువైనా సరే వ్యర్ధమే అని ఆచార్య చాణక్య అన్నారు.

#6. మధ్యలో వదిలేయడం మంచిది కాదు

ఎప్పుడు కూడా పనులను వాయిదా వేయడం లేదంటే మధ్యలో వదిలేయడం మంచిది కాదు. చక్కగా సమయానికి పనులను పూర్తి చేసుకోవాలి. మీ పనులను సక్రమంగా పూర్తి చేసుకుంటే విజయాన్ని కూడా చేరుకోవచ్చు.


End of Article

You may also like