Ads
బ్రష్ చేసేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు నిజానికి దంతాల ఆరోగ్యం విషయంలో తప్పక శ్రద్ధ తీసుకోవాలి. పళ్లను శుభ్రంగా ప్రతి రోజూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సరిగ్గా బ్రష్ చేయక పోవడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి.
Video Advertisement
కొంతమంది త్వరత్వరగా బ్రష్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దంతాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత డెంటిస్ట్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.
ఎప్పుడూ కూడా పళ్లను శుభ్రం చేసుకోవడం పై కాస్త శ్రద్ధ పెడుతూ ఉండాలి లేకపోతే పళ్ళు పుచ్చి పోవడం మొదలు వివిధ రకాల సమస్యలు వస్తాయి. అలానే చాలామంది చేసే కొన్ని తప్పులు ఇక్కడ ఉన్నాయి. ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
#1. ఒత్తిడి పెట్టకండి:
బ్రష్ చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పెట్టి బ్రష్ చేయకండి. ఇలా ఒత్తిడి పెట్టడం వల్ల పంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. చిగుళ్ల కి కూడా ఇబ్బంది కలుగుతుంది.
#2. కాస్త సమయాన్ని కేటాయించండి:
బ్రష్ చేసేటప్పుడు కనీసం మూడు నుండి నాలుగు నిమిషాలపాటు కేటాయించాలి. అప్పుడే పళ్ళు శుభ్రంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాయి అంతేకానీ త్వరగా బ్రష్ చేస్తే పళ్ళు శుభ్రంగా ఉండవు.
#3. బ్రష్ చేసేటప్పుడు బద్దకించద్దు:
బ్రష్ చేయడంపై బద్దకించద్దు. కాస్త మీరు మూడు నిమిషాల సమయాన్ని అయినా వెచ్చిస్తే పళ్ళు బాగుంటాయి. దంతాల సమస్యలు కలుగకుండా ఉంటాయి.
#4. బ్యాక్టీరియా ఉండిపోతుంది:
చిగుళ్ళలో పళ్లలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి పోవాలంటే కచ్చితంగా మీరు నాలుగు నిమిషాలు అయినా సరే బ్రష్ చేయడానికి కేటాయించాలి. అప్పుడే శుభ్రం అవుతాయి. లేదంటే బ్యాక్టీరియా, ఫంగస్ ఉండిపోతాయి.
#5. మీ టూత్ బ్రష్ ని మార్చండి:
టూత్ బ్రష్ ని మారుస్తూ ఉండాలి. ఒకే బ్రష్ తో ఎక్కువకాలం పాటు బ్రష్ చేయడం వలన కూడా సమస్యలు వస్తాయి.
End of Article