డబ్బులున్నాయని ఎట్టి పరిస్థితిలో ఈ 4 తప్పులు చెయ్యద్దు..!

డబ్బులున్నాయని ఎట్టి పరిస్థితిలో ఈ 4 తప్పులు చెయ్యద్దు..!

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు ఎలాంటి పనులు చేస్తే సమస్యలు వస్తాయి వంటి విషయాలను కూడా చెప్పారు. మరి ఆ విషయాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.

పుట్టుకతోనే ధనవంతులు అయిపోరు. ఎంతో కష్టపడి పైకి వస్తే కానీ ధనవంతులు అవ్వలేరు. నిజానికి డబ్బులు బాగా సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. జీవితంలో డబ్బులు సంపాదించడానికి ధనవంతులు కావడానికి ఎంతగానో పడాలి.  ఆ తర్వాత మాత్రమే ధనవంతులు అవ్వచ్చు. అయితే ధనవంతులు అయిన వాళ్లు కచ్చితంగా ఈ తప్పులు చేయకూడదు అని ఆచార్య చాణక్య చెప్పారు. మరి ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. డబ్బుల గురించి ఎవరికీ చెప్పొద్దు:

ఆచార్య చాణక్య మీ దగ్గర ఉండే డబ్బుల గురించి ఇతరులకు చెప్పకూడదని చెప్పారు. కష్టపడి సంపాదించిన డబ్బుని మనమే కాపాడుకోవాలి. మీ డబ్బులు గురించి ఇతరులకి చెప్తే అది తరిగిపోతుంది. కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పే వాళ్ళు దొంగలు కింద మారి మీ డబ్బులు దొంగిలించ వచ్చు. ఇలా డబ్బు కి ముప్పు ఉంటుందని అంటున్నారు.

#2. ఖర్చులను చూసుకోండి:

డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా ఖర్చు చేయకూడదు మీరు మంచిగా డబ్బును ఖర్చు చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డబ్బులని సరిగా ఖర్చు చేస్తారు.

#3. గొప్పలకు పోకండి:

ఇతరులకు చెప్పి గొప్ప పోవద్దు డబ్బులు వచ్చాయని గొప్పలకు పోకండి. మనిషి దగ్గర ఉండే డబ్బులను ఇతరుల అభ్యున్నతికి ఉపయోగించాలి అని చాణక్య అంటున్నారు.

#4. చెడు పనులు చెయ్యద్దు:

డబ్బులు ఉన్నాయి కదా అని చెడు పనులు చేయద్దు ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.


End of Article

You may also like