గర్భిణీలు సూర్య గ్రహణం నాడు ఈ 5 విషయాలను మరచిపోకూడదు..!

గర్భిణీలు సూర్య గ్రహణం నాడు ఈ 5 విషయాలను మరచిపోకూడదు..!

by Megha Varna

Ads

గ్రహణం అంటే కొన్ని పనులకు దూరంగా ఉండాలి. సూర్యగ్రహణం అక్టోబర్ 25న వచ్చింది. అక్టోబర్ 25 సాయంత్రం 4:40 నిమిషాలకు సూర్యగ్రహణం మొదలై 5:24 తో ముగుస్తుంది. అక్టోబర్ 25 మధ్యాహ్నం 2:29 గంటలకి ఐస్లాండ్ లో గ్రహణం ప్రారంభమయ్యి 6:20 కి అరేబియా సముద్రంలో ముగుస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.  సూర్య గ్రహణం నాడు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం.

Video Advertisement

సూర్య గ్రహణం నాడు గర్భిణీలు చేయవలసిన పనులు, చేయకూడని పనులు:

#1. ఎప్పుడైనా సూర్య గ్రహణం వస్తే గర్భిణీలు కచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి హానికరమైన సూర్య కిరణాల వలన కడుపులో ఉండే బిడ్డకి ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. కనుక గర్భిణీలు బయటకి ఆ సమయంలో వెళ్ళకూడదు.
#2. అలానే సూర్య గ్రహణం అయిపోయిన తర్వాత గర్భిణీలు ఒక సారి స్నానం చేయాలి దీనివలన గ్రహణ ప్రభావం వారి పైన పడదు.


#3. గ్రహణ సమయం లో ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కానీ గర్భిణీలు కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని పండ్లు వంటివి తీసుకోవచ్చు. గర్భిణీలు గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. కత్తులు, బ్లేడ్లు, కత్తెర, సూదులు వంటి వాటిని ఉపయోగించకూడదు. వీటివల్ల కడుపులో ఉండే బిడ్డ పైన ప్రభావం చూపుతుంది.
#4. సూర్య గ్రహణం సమయంలో సూర్యుడిని చూడకూడదు. దీని వలన హానికరమైన కిరణాలు మీ కంటికి ఎఫెక్ట్ వస్తాయి.
#5. గర్భిణీలు గ్రహణ సమయంలో మంత్రాలని చదువుతూ ఉంటే మంచిది. జపం చేయడం వంటివి చాలా మంచిది. ఇలా గర్భిణిలు గ్రహణ సమయంలో ఆచరిస్తే మంచిది.

సూర్యగ్రహణం అంటే ఏమిటి..?

భూమికి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు భూమికి సూర్యునికి మధ్య వచ్చినప్పుడు సూర్యగ్రహణాన్ని ఖగోళ సంఘటన అంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే చంద్రుడు నీడ భూమి మీద డైరెక్ట్ గా పడుతుంది దీనిమూలంగా సూర్యుడు కనపడడు. దీనిని సూర్య గ్రహణం అని అంటారు.


End of Article

You may also like