Ads
ఆలయాల వెనుక.. దేవతల పేర్లు వెనుక కొన్ని అర్థాలు ఉంటాయి. అర్థం లేకుండా ఆలయం కానీ దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఉండరు. ఏదైనా ప్రదేశంలో ఆలయం వున్నా కూడా దాని వెనుక పెద్ద కథ ఉంటుంది. అలానే ఎందుకు వాళ్లకి ఆ పేర్లు వచ్చాయి అనే దాని వెనక కూడా పెద్ద కథ ఉంటుంది.
Video Advertisement
పాకిస్తాన్లోని కరాచీ కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ఒక ప్రాంతం ఉండి. అక్కడ హింగ్ లాజ్ దేవి ఆలయం ఉంది. అసలు ఈ దేవి కి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ ఆలయంలో ఒక చిన్న గుహ ఉంటుంది. అక్కడ మట్టితో చేసిన పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద సింధూరం రాసిన రాయి ఉంటుంది. కేవలం ఇది మాత్రమే భక్తులకు కనబడుతూ ఉంటుంది. ఈ అమ్మ వారి తలలోని కొంత భాగం పడిపోవటం వలన ఒక రూపు అంటూ ఉండదు. కేవలం రాయి రాయికి సింధూరం మాత్రమే ఉంటుంది. ఇక దేవికి పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే… సంస్కృత భాషలో హింగ్ అంటే సింధూరము అందుకనే ఈ దేవికి హింగ్ లాజ్ మాత అని పేరు వచ్చింది.
ఇంకో కథ ప్రకారం చూసుకున్నట్లయితే హింగలడు అనే రాక్షసుడు ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. అతనిని సంహరించడానికి అమ్మవారు అవతరించిందని.. ఆ రాక్షసుడు అమ్మవారి నుండి తప్పించుకుంటూ గుహలోకి వెళ్ళాడని వెనకాల అమ్మవారు వెళ్లిందని అంటారు. ఆ రాక్షసుడిని అమ్మవారు సంహరించడం వలన ఆ యొక్క అమ్మవారికి హింగ్ లాజ్ మాత అని పేరు వచ్చింది అని మరో కథనం ప్రకారం తెలుస్తోంది. ఈ ఆలయాన్ని చేరుకోవడం గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేదట. వెళ్లడం కష్టమయ్యేదట కానీ ఇప్పుడు ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. సదుపాయాలు పెరగడం వలన భక్తులు వెళ్లేందుకు ఇబ్బందేమీ లేదు.
End of Article