Ads
నాగుల చవితి నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు నాగుల చవితి నాడు పాటించడం జరుగుతుంది. కొందరు పూజలు చేస్తూ ఉంటారు. కొందరు పుట్ట దగ్గరికి వెళ్లి పాములకి పాలు పోస్తూ ఉంటారు. కొందరు గుడ్లు కూడా పెడుతూ ఉంటారు. అయితే పూర్వీకులు ఎలా అయితే ఫాలో అయ్యేవారు ఆ విధంగా మనం కూడా నడుచుకుంటూ ఉంటున్నాం.
Video Advertisement
ఒకవేళ కనుక ఏదైనా పండుగకి కానీ నాగుల చవితికి కానీ మీకు ఆనవాయితీ లేకపోతే పెద్దవాళ్ళని అడిగి దాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటారు.
నాగులచవితి ఎందుకు చెయ్యాలి..?
పాములను పూజించే సాంప్రదాయం మనది. పాములకి మనం పూజలు చేస్తూ ఉంటాము. ఆలయాలు కూడా ఉన్నాయి. సుబ్బారాయుడు షష్టి నాడు కూడా నాగేంద్రుడిని మనం పూజిస్తాము. నాగుల చవితి నాడు కూడా మనం నాగేంద్రుడిని పూజించడం జరుగుతుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి నాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటూ ఉంటాము. నాగుల చవితి నాడు ఉపవాసం ఉంటే పిల్లలకి మంచిదని పెద్దలు ఉపవాసం ఉంటారు.
ఈ తప్పులని మాత్రం చెయ్యద్దు:
#1. నాగేంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే నాగజాతంతా కూడా సహాయం చేస్తుందని అంతా భావిస్తారు.
#2. చవితి నాడు నాగలి పట్టకూడదట. ఎందుకంటే ఒకరోజు ఓ రైతు నాగలి దున్నుతున్నప్పుడు పుట్ట కి తగిలి పుట్టలో ఉన్న పిల్లపాములన్నీ కూడా మరణించాయి. గుడ్లన్నీ కూడా చితికిపోయాయి. దీనితో పాముకి కోపం వచ్చింది. దానితో విషం జిమ్మితే రైతు కళ్ళు పోతాయి అందుకనే నాగుల చవితి నాడు రైతులు నాగలి పట్టరు.
#3. సర్ప దోషం వలన పిల్లలు కలగని వాళ్ళు నాగుల శ్లోకాలు వంటివి చదువుకుంటే చాలా మంచిది.
#4. అలానే ఈరోజు తరిగిన కూర తినకూడదు.
#5. నాగుల చవితి నాడు నాగ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచి కలుగుతుంది.
End of Article