Ads
అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రాహుల్.. కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ చేశాక మరుసటి బంతికే రాహుల్ ఔటయ్యాడు.
Video Advertisement
అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య వేగంగా ఆడగా.. కోహ్లి నిలకడగా పరుగులు రాబట్టాడు. విరాట్ కోహ్లి ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధ శతకం నమోదు చేశాడు. వేగంగా ఆడిన సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఆఖర్లో దూకుడుగా ఆడిన అశ్విన్ 6 బంతుల్లో 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
గత మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసిన టస్కిన్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 15 రన్స్ మాత్రమే ఇచ్చినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ హసన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో 66 పరుగులు చేసింది. అంతరం వర్షం కారణం గా మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
దీంతో డీఎల్ యస్ మెథడ్ తో బంగ్లాదేశ్ విన్ అయితే నెక్స్ట్ రన్ రేట్ కీలకం అవుతుంది. తర్వాత సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోవాలి. బంగ్లాదేశ్ పాక్ తో మ్యాచ్ లో ఓడిపోవాలి.తర్వాత ఇండియా జింబాబ్వే తో మ్యాచ్ లో భారీ రన్ రేట్ తో గెలిస్తేనే సెమీస్ కి వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కి సంబంధించిన మీమ్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16#17#18#19
#20
End of Article