Ads
అన్ని సీజన్లలోనూ చలి కాలం చాలా బాగుంటుంది. కుండపోత వర్షాలుండవు, మండిపోయే ఎండలుండవు. శీతాకాలం లో వాతావరణం ఎంతో ఆహ్లదకరం గా ఉంటుంది. కానీ, చలి కాలం వచ్చిందంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎక్కడ లేని సమస్యలు ఈ కాలం లోనే వస్తుంటాయి. సాధారణం గా వచ్చే జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు మామూలుగానే వస్తూ పోతూ ఉంటాయి.
Video Advertisement
అయితే, చాలా మందికి చలికాలం వచ్చేసరికి ఒంట్లో కండరాలు పట్టేస్తుంటాయి. ఫలితం గా ఒళ్ళు నెప్పులు గా ఉంటాయి. ఉదయం నిద్ర లేచేసరికి కండరాలు పట్టేయడం వలన ఒళ్ళు నెప్పులు వస్తుంటాయి. కానీ వీటిని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడడం అంత శ్రేయస్కరం కాదు. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ఈ నెప్పులు రాకుండా మీరు జాగ్రత్తపడచ్చు.
#1. మీరు తీసుకునే ఆహరం లో ఫైబర్ ఎక్కువ గా ఉండేలా చూసుకోండి. ఫైబర్ తో కీళ్ల నెప్పులకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#2.అలాగే చలికాలం ఏమైనా దెబ్బలు తగిలినా.. అంత తొందరగా మానవు. అలాంటప్పుడు మీరు ఇంట్లో వాడే అల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఒక క్లాత్ లో చుట్టి దానిని వేడి నీటిలో ముంచి తీసి దెబ్బ తగిలిన చోట ఉంచడం వలన మీకు ఉపశమనం లభిస్తుంది.
#3. రోజు రాత్రి పడుకునేటప్పుడు వేడి వేడి పాలలో దాల్చిన చెక్క పొడి ని వేసుకుని తాగండి. ఇది మీకు మంచి నిద్రని ఇస్తుంది. అలాగే ఒళ్ళు నొప్పులు లేకుండా కాపాడుతుంది.
#4. అలాగే, ఒళ్ళు నొప్పులు తగ్గించడం లో ఆపిల్ సిడార్ వెనిగర్ ఎంతగానో పని చేస్తోంది. మీరు స్నానం చేసే బకెట్ నీటిలో ఒక కప్ ఆపిల్ సిడర్ వెనిగర్ ని వేసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
#5. అలాగే శరీరానికి అవసరమైనంత నీటిని తాగడం కూడా కీలకమైనది. చలికాలం లో ఎక్కువ గా దాహం వేయదు. అలా అని మీరు నీటిని తాగకపోయినా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
End of Article