Ads
జీవితంలో అనుకున్నది సాధించాలన్నా, సక్సస్ పొందాలన్నా మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా యవ్వన దశ చాలా కీలకం. ఒక వ్యక్తి బాగుపడడానికి, చెడిపోవడానికి ఆ దశ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో అనుకున్నది నెరవేర్చవచ్చు.
Video Advertisement
అయితే ఆచార్య చాణక్య తన గ్రంథంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో పైకి రావచ్చు అనేది చెప్పారు. మరి చాణక్య నీతి చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
అన్ని జన్మల్లోగా మానవ జన్మ ఉత్తమమైనది. అయితే ఆహారం, నిద్ర, భయం ఇవన్నీ కూడా మనుష్యుల్లో జంతువుల్లో ఉంటూనే ఉంటాయి. కానీ మనకి జంతువులకి తేడా వుంది. జ్ఞాన సముపార్జన మనలో వుండే ప్రత్యేక గుణం. ఇది మనల్ని వాటి నుండి వేరు చేస్తుంది. మనుషులలోని జ్ఞానాన్ని పొందే గుణం మనల్ని వాటి నుండి వేరు చేస్తుంది అని మనం గ్రహించాలి. ఒకవేళ కనుక ఏ వ్యక్తి అయినా సరే మనిషి జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే, అతను జంతువుతో సమానమని చాణక్య తెలిపారు.
అలానే మనిషి జీవితంలో పైకి రావాలంటే స్నేహితులతో ఈ విషయాలను చెప్పకూడదు. నా భార్య అలాంటిది, నా భార్య ఇలాంటిది అని ఎప్పుడూ కూడా మీ స్నేహితులతో ప్రస్తావించద్దు. ఇలా కనుక చెప్పారంటే ఖచ్చితంగా భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి. అలాగే భవిష్యత్తులో ఎంత పెద్ద సమస్య అయినా ఇది తీసుకురావచ్చు. అవమానాలు గురించి కూడా మీ స్నేహితులతో చెప్పకండి అని చాణక్య అన్నారు.
End of Article