Ads
శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మానసికంగా దృఢంగా ఉంటే ఒత్తిడిని కూడా మనం ఎదుర్కోడానికి అవుతుంది.
Video Advertisement
అయితే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు మనకి సహాయపడతాయి. మరి మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
#1. విటమిన్ సి:
విటమిన్ సి ని కచ్చితంగా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇది రోగని రోధక శక్తిని పెంచడమే కాక మెదడులోనే డోపమైన్ ని కూడా చూసుకుంటుంది శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్లకి క్షీణత కలుగుతుంది దీనివలన ఆందోళన మొదలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి విటమిన్ సి ని తప్పక డైట్లు తీసుకుంటూ ఉండాలి.
#2. విటమిన్ డి:
విటమిన్ డి కూడా మానసిక ఆరోగ్యనికి చాలా మంచిది. అలానే ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్, బీ 12, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇవన్నీ కూడా డైట్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చక్కటి పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈ పోషక పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను సమృద్ధిగా తీసుకుంటూ ఉండండి.
#3. జింక్:
జింక్ కూడా చాలా ముఖ్యం. జింక్ లోపం కలిగితే భావోద్వేగాలు దెబ్బతింటాయి. అలానే స్ట్రెస్ ని కూడా తట్టుకోలేరు. జింక్ లోపం ఉన్నట్లయితే నిద్రలేమి ఆందోళన మొదలైన సమస్యలు కలుగుతాయి.
End of Article