Ads
చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు.
Video Advertisement
వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే యువతలో ఈ 4 లక్షణాలు అస్సలు ఉండకూడదు అని చాణక్య అన్నారు. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
#1. కోపం:
కోపం అస్సలు ఎవరికీ ఉండకూడదు. కోపం ఉంటే చిక్కులే తప్ప మరేం ఉపయోగం ఉండదు. ముఖ్యంగా యువతలో కోపం అసలు ఉండకూడదు. కోపం వలన ఏమీ చేయడానికి అవ్వదు. పైగా కోపం ఉండడం వలన ఆలోచించడానికి కూడా కుదరదు.
#2. వ్యసనం:
అలానే మనిషికి ఎటువంటి వ్యసనాలు ఉండకూడదు ముఖ్యంగా యువతకి ఎటువంటి వ్యసనాలు అలవాటు అయిపోకూడదు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం.. మత్తు వంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇటువంటివి ఉంటే జీవితంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎవ్వడు. పైగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
#3. బద్ధకం:
బద్ధకం ఉంటే ఏ పని చేయలేరు కనీసం ఏ పనైనా చేయాలని ఆలోచనలో కూడా రాదు. బద్ధకాన్ని విడిచి పెట్టేస్తే జీవితంలో మనం ముందుకు వెళ్లడానికి అవుతుంది. కాబట్టి బద్ధకం ఉంటే కూడా వదిలేసుకోండి.
#4. చెడ్డ వారితో స్నేహం:
చెడ్డ వారితో స్నేహం వలన మనం వెనక్కి వెళ్దాం తప్ప ముందుకు వెళ్లలేము కనుక అటువంటి వ్యక్తులతో స్నేహం చేయకండి మంచి వ్యక్తులతో స్నేహం చేస్తే మంచిది.
End of Article