Ads
చలికాలంలో అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని తగ్గించక పోతే విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చలికాలంలో ఎక్కువగా ముక్కు కారడం, నాజల్ కంజెషన్, సైనసైటిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మనం మందుల వరకు వెళ్ళిపోకర్లేదు.
Video Advertisement
ఇటువంటి సమస్యలను దూరం చేయడానికి ఆయుర్వేద చిట్కాలని అనుసరించవచ్చు. వీటిని అనుసరించడం వలన ముక్కు కారడం, నాజల్ కంజెషన్, సైనసైటిస్ మొదలైన సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
#1. అల్లం, పుదీనా టీ:
ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. చలికాలంలో వివిధ రకాల సమస్యల్ని దూరం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సాధారణ టీ కాకుండా మీరు ఈ టీ ని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్లలో కొంచెం అల్లం, పుదీనా ఆకులు వేసి మరిగించండి. కావాలనుకుంటే దాల్చిని, యాలకులు, లవంగం, మిరియాలని కూడా వేసుకోవచ్చు. ఇలా వీటిని వేసుకుని టీ మరిగించుకుని చల్లారిన తర్వాత గోరువెచ్చగా తీసుకుంటే బాగుంటుంది. ఇలా చలికాలంలో వచ్చే సమస్యలకి చెక్ పెట్టొచ్చు.
#2. యూకలిప్టస్ ఆయిల్ తో ఆవిరి పట్టండి:
యూకలిప్టస్ ఆయిల్ తో ఆవిరి పట్టడం వలన కూడా చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. ఇలా చేయడం వలన దగ్గు తగ్గుతుంది. అలానే ముక్కు ఫ్రీగా ఉంటుంది.
#3. వేయించిన వాము:
మూడు నుండి నాలుగు చెంచాల వాముని వేయించుకోండి. నూనె, నీళ్లు వేయొద్దు. వేయించిన తర్వాత ఒక క్లాత్ ని తీసుకొని ఈ వాముని వేసి రెండు శ్వాసను పీలుస్తూ వుండండి. ఇది కూడా చాలా సమస్యల్ని దూరం చేస్తుంది.
End of Article