Ads
డ్రై ఫ్రూట్స్ లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అన్న సంగతి మనకి తెలుసు. కానీ డ్రై ఫ్రూట్స్ ని కొనుగోలు చేయడానికి ఖర్చు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది కనుక డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషక పదార్థాలు ఇతర ఆహార పదార్థాల ద్వారా మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.
Video Advertisement
డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషక పదార్థాలు ఈ ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. పైగా తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషక పదార్థాలని మనం వీటి ద్వారా పొందొచ్చు.
#1. అరటి పండ్లు:
అరటి పండ్లు మనకి ప్రతి సీజన్ లో దొరుకుతూనే ఉంటాయి. అరటిపండ్ల లో ఫైబర్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి.
#2. పుచ్చకాయ గింజలు:
పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి మంచిది ఇందులో ప్రోటీన్స్ తో పాటుగా క్యాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి.
#3. శెనగలు:
ఎండుద్రాక్షకి బదులుగా మనం శెనగలు తినొచ్చు ఇది కూడా పోషక పదార్థాలతో నిండి ఉంటుంది.
#4. వేరుశనగ:
ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, కాలుష్యం ఇందులో ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కి బదులుగా మనం వీటిని కూడా తీసుకోవచ్చు. పల్లీ చెక్కి వంటివి కూడా మనం తినచ్చు. లేదంటే కొన్ని పల్లీలని వేయించుకుని కూడా తినచ్చు. ఎలా తిన్నా సరే ఆరోగ్యానికి మంచిదే.
#5. పొద్దుతిరుగుడు విత్తనాలు:
ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫాలిక్ యాసిడ్ తో పాటుగా ఒమేగా త్రీ, మాంగనీస్ వీటిలో మనకి లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ కి బదులుగా తక్కువ ధరకి మనం వీటిని కొనుగోలు చేసి పోషక పదార్థాలని పొందొచ్చు. దానితో ఆరోగ్యం బాగుంటుంది.
#6. సోయాబీన్స్:
బాదం లాగ సోయాలో కూడా చక్కటి పోషకాలు ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఇందులో నిండుగా ఉంటాయి. కాబట్టి సోయాబీన్స్ ని కూడా డైట్ లో చేర్చుకుంటూ ఉండండి.
End of Article