Ads
చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో మనకి తెలుసు. రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి ని పొందారు చాణక్య. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు కూడా పాటించే వాళ్ళు ఎందరో. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా చెప్పింది. అయితే ఆచార్య చాణక్య దాంపత్య జీవితం గురించి కూడా చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే దాంపత్య జీవితం లో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండచ్చు. ఏ ఇబ్బందులు రావు.
Video Advertisement
అయితే మరి ఆచార్య చాణక్య భార్య భర్తలు ఆనందంగా ఉండడం కోసం చెప్పిన విషయాలని చూద్దాం. ఆచార్య చాణక్య భార్య భర్తలు ఆనందంగా ఉండాలంటే వీటిని తప్పక ఆచరించాల్సిందే అని అన్నారు. భార్య భర్తలు ఆనందంగా ఉండేదుకు వీటిని తప్పక అనుసరించండి మరి.
#1. అహంకారం వద్దు:
భార్యా భర్తల మధ్య ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా.. ఆనందంగా ఉండాలన్నా అహంకారం ఉండకూడదని చాణక్య అన్నారు. అహంకారానికి అస్సలు వైవాహిక జీవితం లో చోటు ఇవ్వకూడదు. అహంకారం ఉండకుండా చూస్తే సమస్యలే వుండవు. చాలా మంది జంటలు అహంకారం మూలానే విడిపోతున్నారు.
#2. గౌరవం ఇవ్వండి:
భార్యా భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు గౌరవించుకుంటే ఏ బాధ ఉండదు.
#3. అనుమానం పనికిరాదు:
భార్యాభర్తలు మధ్యన అనుమానం రాకూడదు. అనుమానాలు వస్తే ఆ సంబంధం పూర్తిగా తెగి పోతుంది. సో ఎప్పుడు కూడా అనుమానం, అపార్ధాలు కలగకుండా చూసుకోండి అని ఆచార్య చాణక్య అంటున్నారు.
#4. అబద్దాలు వద్దు:
అబద్ధాలని అస్సలు చెప్పద్దని చాణక్య అన్నారు. ఎప్పుడైనా ఏ బంధం లో అయినా అబద్దాలు చెప్తే.. ఆ బంధం నిలవదు. కాబట్టి ఈ తప్పు ని కూడా చేయద్దు. అబద్దాలు చెప్పకుండా చూసుకోండి అని ఆచార్య చాణక్య అంటున్నారు.
End of Article