Ads
వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అందులో సందేహం లేదు. ఎంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ముఖ్యంగా వయసు పైబడే కొద్ది ఎముకల సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు.
Video Advertisement
ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఇలా చేస్తే చాలు. మరి ఎముకలని దృఢంగా ఉంచుకోవడానికి మార్గాలని ఇప్పుడు చూద్దాం.
ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి:
#1. పెరుగు తీసుకోండి:
పెరుగులో క్యాల్షియం ఉంటుంది ఇది ఎముకలు దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. పైగా ఇందులో విటమిన్ బి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో పెరుగును తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.
#2. మంచి పోషకాహారం:
మంచి పోషకాహారాన్ని కూడా మీరు డైట్ లో తీసుకుంటూ ఉండండి క్యాల్షియం విటమిన్ డి ఎక్కువ ఉండే ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. సమస్యలేమీ రాకుండా ఉంటాయి.
#3. పాలని తాగండి:
ప్రతి రోజు పాలు తీసుకుంటే ఎముకల దృఢంగా ఉంటాయి. విటమిన్ డి తో ఫార్టీఫైడ్ చేసిన మిల్క్ ని తీసుకోవడం వలన డబల్ ప్రయోజనాలను పొందడానికి అవుతుంది.
#4. చీజ్ ని తీసుకోండి:
చీజ్ ని తీసుకోవడం వలన కూడా ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. సో దీన్ని కూడా తీసుకుంటూ వుండండి.
#5. చేపలు:
సాల్మన్, టున చేపలని తీసుకుంటే కూడా ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు అవుతుంది.
#6. ఆకు కూరలు:
ఆకు కూరల్లో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి ఆకుకూరలను తింటే కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.
#7. కమల రసం:
కమల రసాన్ని తాగడం వలన కూడా ఎముకలు బలంగా ఉంటాయి. కనుక కమలాలని కూడా మీరు జ్యూస్ చేసి రెగ్యులర్ గా తీసుకుంటూ వుండండి. అలానే బాదం గుడ్లను తీసుకుంటే కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
End of Article