కలలో పాము కనపడితే ఏం అవుతుంది..? స్వప్న శాస్త్రం ఏం చెబుతోందంటే..?

కలలో పాము కనపడితే ఏం అవుతుంది..? స్వప్న శాస్త్రం ఏం చెబుతోందంటే..?

by Megha Varna

Ads

మనం నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. కల లో ఒక్కొక్క సారి మనకి ఉద్యోగం వచ్చినట్లు లేదంటే ఇల్లు కట్టుకున్నట్లు వంటి మంచి విషయాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్క సారి భయంకరమైన పీడ కలలు వస్తూ ఉంటాయి. ఏ సింహమో మనల్ని తరుముతున్నట్లు… పాము వెంబడిస్తున్నట్లు ఇలా భయంకరమైనవి కూడా కనబడుతూ ఉంటాయి.

Video Advertisement

ఒక్కొక్క సారి మన కలలో కనపడేవి నిజమేమోనని భయపడిపోతూ ఉంటాం చెమటలు పట్టేస్తుంటాయి కూడా.

అయితే నిద్రపోయినప్పుడు మనం చూసే విషయాలని బట్టి మన జీవితం లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో కనుక పాము కాటు వేసినట్లు కనపడితే జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే మరి కలలో పాము కాటు వేసినట్లు కనపడితే ఏమవుతుంది అనే దాని గురించి చూద్దాం. నిజానికి పాము అంటే అందరికీ భయం వేస్తుంది. పాము బయట కనపడినా, కలలో కనపడినా సరే మనం చాలా భయపడిపోతూ ఉంటాం. కలలో కనుక నల్ల పాము కనబడితే అది అశుభం. నల్ల పాము కనుక కలలో కనపడితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తున్నాయని సంకేతం. కలలో పాముని కనుక చంపితే అది శుభ సూచకం. పైగా మీరు విజయం కూడా సాధించడానికి అవుతుంది.

snakes

అదే ఒకవేళ మీ కల లో పాము ముంగీస పోరు కనపడిందంటే అది చెడు సంకేతంగా భావించాలి. ఇలాంటి కలలు కనుక వస్తే సమస్యలు తప్పవు అని దానికి అర్థం. పైగా ఆ సమస్యలు నుండి బయటపడడం కూడా కష్టంగా ఉంటుంది. కలలో కనుక పామును పట్టుకున్నట్లు కనపడితే అది శుభ సూచికం. ఎప్పటి నుండో అవ్వని పనులు పూర్తయిపోతాయి. కలలో పాము మీకు కాటు వేసినట్టు కనపడితే వ్యాపారంలో ఉద్యోగంలో సమస్యలు వస్తాయని దానికి సంకేతం. పదేపదే పాములు కలలోకి వస్తే పితృ దోషం ఉన్నట్టు.


End of Article

You may also like