Ads
ఇంట్లో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం చేసే పనులు బట్టి మన ఇంటి వాతావరణం ఆధారపడి ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా కొన్ని రకాల చిట్కాలని అనుసరిస్తూ ఉండాలి పాజిటివిటీ రావాలంటే వంట గదిలో కచ్చితంగా వీటిని ఫాలో అవుతూ ఉండాలి.
Video Advertisement
మరి వంట గది లో ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి..? ఎలాంటి వాటిని ఫాలో అవ్వాలి అనేది చూద్దాం.
#1. ముదురు రంగుల్ని ఉంచండి:
ఇంట్లో పాజిటివిటీ కలగాలంటే వంట గదిలో ముదురు రంగులు వేసుకోండి. పసుపు, ఎరుపు, ఆరెంజ్ వంటి వాటిని వేయడం వలన పాజిటివిటీ వస్తుంది నెగిటివిటీ దూరమైపోతుంది.
#2. ఈ దిక్కులో అల్మారాలని ఉంచండి:
అల్మారాలని ఎప్పుడూ కూడా నైరుతి దిశ లో ఉంచడం మంచిది. నైరుతి వైపు ఉంచడం వలన అదృష్టం కలుగుతుంది.
#3. కిటికీలని ఉంచండి:
కిటికీలు తెరిచి ఉంచడం మంచిది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
#4. నీటి కోసం మంచి స్పేస్:
ఎప్పుడు కూడా మీరు నీటిని నిల్వ ఉండకూడదు బయటికి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉండాలి. పైగా అగ్నికి నీరుకి మంచి స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది.
#5. ఫ్రిడ్జ్ ని ఈ దిశలో ఉంచండి:
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఫ్రిడ్జ్ ని నైరుతి వైపు పెట్టండి ఇది కుటుంబ సభ్యుల మధ్య సమస్యలను కూడా తొలగిస్తుంది.
#6. ఈ దిక్కులో వంటగదిని ఉంచండి:
వంటగది ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరం లేదంటే పడమర వైపు ఉండాలి.
#7. బియ్యం, పిండిని ఇలా ఉంచకండి:
బియ్యం, పిండిని అస్సలు ప్లాస్టిక్ డబ్బాలలో వేయకండి ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది. అలానే ఇంట్లో సరైన వెల్తురు గాలి కూడా ప్రవేశిస్తూ ఉండాలి. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది చూశారు కదా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించాలంటే వంటగదిలో ఎటువంటి మార్పులు చేయాలి అని.. మరి ఈ మార్పులు కనుక చేశారంటే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
End of Article