“మహేష్” పర్సనల్ మేకప్ మాన్ ఇంట్లో విషాదం..!! పరామర్శించిన నమ్రత..!!

“మహేష్” పర్సనల్ మేకప్ మాన్ ఇంట్లో విషాదం..!! పరామర్శించిన నమ్రత..!!

by Anudeep

Ads

సూపర్ స్టార్ మహేష్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేశ్‌బాబు- నమత్రా శిరోద్కర్‌ జంట ఆన్యోన్య దాంపత్యానికి కేరాఫ్‌గా నిలిచారు. ప్రస్తుతం సినిమాల్లో మహేశ్‌ బిజీగా ఉంటుంటే, నమ్రత పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు చూసుకుంటోంది. మహేష్ తన దగ్గర పని చేసేవారిని సొంత మనుషుల్లా చూసుకుంటూ ఉంటారు.

Video Advertisement

 

 

తాజాగా మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసి వెంటనే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పట్టాభి ఇంటికి వెళ్లారు. పట్టాభి తండ్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు SSMB28కి సంబంధించి షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లారు. మహేష్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో పట్టాభిని పరామర్శించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

namrata went to mahesh's personal make up man's hpuse to console..

మహేష్ బాబు దగ్గర పట్టాభి ఎప్పటి నుంచో పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. దాదాపు మహేష్ సినిమాలన్నింటికీ పట్టాభి పర్సనల్ మేకప్ మెన్ గా చేశారు. ఆయనకు మహేష్ బాబు ఫ్యామిలితో ప్రత్యేక అనుబంధం ఉంది. మహేష్ బాబు పట్టాభిని సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తాడు. సోషల్ మీడియాలోనూ ఆయన గురించి పోస్టులు పెట్టేవారు. మహేష్ దంపతులు తమ దగ్గర పని చేసే వారిని కూడా సొంత మనుషుల్లాగే చూసుకుంటారు. వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాలుగా అండగా ఉంటున్నారు. వారి పిల్లల చదువులకు, అలాగే ఏదైనా అవసరం వచ్చినపుడు అండగా నిలుస్తున్నారు మహేష్ దంపతులు.

namrata went to mahesh's personal make up man's hpuse to console..

మహేష్ – నమ్రత దంపతులు ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాలు చేసి తమ మంచి మనసును చాటుకుంటున్నారు. అటు ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు ఈ జంట గుండె ఆపరేషన్‌ చేయించి ప్రాణదానం చేశారు. అంతేకాదు, పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికసాయం కూడా చేస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవలోనూ మహేష్ కు నమ్రత వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.


End of Article

You may also like