స్త్రీలు గాజులు ధరించడానికి, గర్భాశయానికి సంబంధం ఉందా..? గాజులు ఎందుకు ధరించాలంటే..?

స్త్రీలు గాజులు ధరించడానికి, గర్భాశయానికి సంబంధం ఉందా..? గాజులు ఎందుకు ధరించాలంటే..?

by Megha Varna

Ads

ఈ రోజుల్లో పెద్దలు చెప్పిన మాటల్ని అందరూ కొట్టేపారేస్తున్నారు. పెద్దలు చెప్పిన మాటలని చెవికి ఎక్కించుకోవడం లేదు. చెప్పారు లే అన్నట్లు తీసి పారేస్తున్నారు కానీ నిజానికి పూర్వీకులు పెట్టిన ఆచారాలు ఊరికే పెట్టలేదు, వాటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అందుకని మనం పెద్దలు చెప్పిన మాటలను వింటూ ఉండాలి అలానే పూర్వికులు పెట్టిన ఆచారాలను పాటిస్తూ ఉండాలి. మహిళలు ప్రతిరోజూ గాజులు, మెట్టెలు, మంగళసూత్రాలు, పట్టీలు వంటివి ధరిస్తూ ఉంటారు.

Video Advertisement

ఈ మధ్యకాలంలో మహిళలు వాటిని తీసేస్తున్నారు కానీ మన అమ్మని అమ్మమల్ని చూసుకుంటే వాళ్ళు నిత్యం ఈ ఆభరణాలని వేసుకుంటారు. అస్సలు తీసేయరు.

మహిళలు గాజులు వేసుకోవడం సనాతన భారతీయ సంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం అని చెప్పొచ్చు. ఎప్పటి నుండో ఈ ఆచారం నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా గాజులను వేసుకోవాలి అని అంటారు. ముత్తయిదుకి ఉండే ఐదు లక్షణాలలో ఇది కూడా ఒకటి అందుకే పెళ్లి అయిన ప్రతి ఒక్క స్త్రీ కూడా చేతి నిండుగా గాజులు వేసుకుంటూ ఉంటారు.

కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది వేసుకోవడం లేదు గాజులు వేసుకుంటే వాళ్లలో నామోషీ వస్తోంది. పెళ్లికి ముందు కూడా గాజులు వేసి 16 రోజుల పండుగ వరకు ఉంచుకోమని చెప్తారు. సీమంతం సమయంలో కూడా గాజులని వేస్తూ ఉంటారు. అయితే గాజులు వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా వున్నాయి.

గాజులు అలంకరణకే కాదు ఆరోగ్య కూడా. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు గాజులు వేసుకోవడం వలన కలగవని తెలుస్తోంది. స్త్రీలు గాజులు ధరించడం వలన శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని సైంటిస్టులు అంటున్నారు. చేతులని అటువైపు ఇటువైపు కదిలిస్తుంటే గాజులు వెనక్కి ముందుకు వెళతాయి అప్పుడు మణికట్టు భాగం అంతా కూడా మసాజ్ అవుతుంది దాంతో మణికట్టు భాగం నుండి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని సైంటిస్ట్లు అంటున్నారు.

గర్భాశయం నాడులు కూడా చురుకుగా పనిచేస్తాయి. గర్భాశయ నాడులు మణికట్టు ముంజేతికి లింక్ అయ్యి ఉండడం వలన గాజులు కదిలినప్పుడు మహిళల మణికట్టునాడులు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటాయి. దీంతో గర్భాశయ నాడులు ఉత్తేజితమై గర్భాశయం బాగా పని చేసేలా చూస్తాయి. అలానే గాజులను వేసుకోవడం వలన అలసట పూర్తిగా తగ్గుతుంది. శరీరంలో అధిక వేడి ఉంటే అది కూడా తొలగిపోతుంది.


End of Article

You may also like