Ads
కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసే పద్మ అవార్డులు వివిధ రంగాలలో సేవ చేసిన పౌరులకి ఇచ్చే పురస్కారాలు. పౌర పురస్కారాలలో అత్యున్నత పురస్కారంగా భారతరత్న అగ్రభాగాన ఉంది. రెండవ పురస్కారం పద్మవిభూషణ్, మూడవ పురస్కారం పద్మ భూషణ్, నాలుగవ పురస్కారం పద్మశ్రీ.
Video Advertisement
పద్మశ్రీ పురస్కారం మెడల్ రూపంలో వుంటుంది. ఈ పతాకం పై ‘పద్మ, శ్రీ’ అనేవి దేవనాగరి లిపిలో వ్రాయబడి వుంటాయి. కళలు, విద్య,సాహిత్యం,ఇంజినీరింగ్, సైన్స్, క్రీడలు, ప్రజా వ్యవహారాలు, వైద్యం, పౌర సేవ, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో పాటుగా అనేక రంగాలలో అసాధారణమైన, విశిష్టమైన సేవలు చేసినందుకు గాను పద్మ అవార్డులు ప్రధానం చేస్తారు.
పద్మ అవార్డుల ఎంపికలో సమర్థత అనేది ప్రధానాంశం. ఈ అవార్డులు మొదట ఎప్పుడు ఇచ్చారో? ఎలా ఎంపిక చేస్తారు? అవార్డును ఎవరు ప్రధానం చేస్తారో ఇప్పుడు చూద్దాం..
ఈ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు?
ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్ విజేతలను ప్రకటిస్తారు. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి మార్చిలేదా ఏప్రిల్ నెలలో ప్రదానం చేస్తారు. 1954లో భారతరత్న మరియు పద్మ అవార్డులు స్థాపించబడ్డాయి. మొదట్లో ఈ అవార్డును పద్మ విభూషణ్ అని అనేవారు. దానితో పాటుగా మూడు వర్గాలు ఉండేవి. అవి పహేలా వర్గ్అని, దుస్రా వర్గ్, తిస్రా వర్గ్.
అయితే ఈ పేర్లను రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా 1955లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా మార్చబడింది. పద్మవిభూషణ్ అవార్డు విశిష్ట మైన మరియు అసాధారణమైన సేవకు, పద్మభూషణ్ అవార్డు అత్యున్నత విశిష్ట సేవకు, పద్మశ్రీ అవరడు విశిష్ట సేవకు గాని ఇవ్వబడుతుంది. పద్మ అవార్డులు 1978 ,1979, 1993 – 1997 మధ్య మినహా ప్రతి ఏడాది ప్రధానం చేశారు.
అవార్డును స్వీకరించడానికి అర్హత..
కేంద్ర హోం మినిస్ట్రీ శాఖ ఆధ్వర్యంలోని పద్మ అవార్డుల కమిటీ ప్రకారం, ఇండియాలోని ఏ పౌరుడైనా జాతి, స్థానం, వృత్తి, లింగంతో సంబంధం లేకుండా వీటికి అర్హులు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు వీటికి అర్హులు కాదు. కళలు, ప్రజా వ్యవహారాలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, క్రీడ వంటి ఏ రంగం లోని వారిని అయిన ఎంచుకోవచ్చు. ప్రతి ఏడాది ఇచ్చే పద్మ అవార్డుల సంఖ్య 120. అయితే ఈ సంఖ్య మరణించిన తరువాత ఇచ్చే అవార్డులు, ఎవరైనా నాన్-రెసిడెంట్ ఇండియన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, విదేశీ ఆధారిత ఎంచుకోబడిన వారికి మినహాయిస్తుంది. నామినేషన్లు ఎలా చేయాలి..
ప్రతి ఏడాది ఈ అవార్డుల కోసం సిఫార్సులు మే 1 నుండి సెప్టెంబర్ 15 వరకు అన్ని రాష్ట్ర గవర్నమెంట్స్, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఉనియం గవర్నమెంట్ మంత్రిత్వ శాఖల నుండి కోరబడతాయి. అలాగే గతంలో భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నవారు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు కూడా కేంద్ర, రాష్ట్రల పేర్లను చెప్పవచ్చు.
Also Read: TSPSC పేపర్ లీక్ లో కొత్త ట్విస్ట్..! “వాట్సాప్ చాట్” ఆధారంగా..?
End of Article